సెప్టెంబర్ 7 2020

From Nithyanandapedia
Jump to navigation Jump to search

పేరు:

నమ్మకమైన పరిష్కారములు || పరమశివోహం S11 || వాయుస్తంభన శక్తి || ఆష్టాష్ట భైరవ దర్శనం

కథనం

The Supreme Pontiff of Hinduism, Jagatguru Mahasannidhanam, His Divine Holiness expounded on the principle, ‘Unclutch to go Beyond Delusion: Guaranteed Solution’ during the Nithyananda Satsangh. The Darshan for today was AshtaAshta Bhairavas Darshan.

Contributing to over 108 humanitarian causes of Shrikailasa Uniting Nations, KAILASA's Nithyananda Hindu University marks today as Season 3, Day 12 of Paramashivoham with over 1200 delegates across 20 countries participating in the convention. One of the major highlights of KAILASA’s contributions through this convention is Power Manifestation, today being the Power of Levitation.

Sanyasis of the Nithyananda Order of Monks and initiated Acharyas worldwide, affiliated with the Department of Education of KAILASA conducted a series of seminars on Enlightenment with daily activities/techniques, Shiva Sutras, Patanjali Yoga Sutras the Samyamas, Siddhis vs Shaktis, Introduction to Aushadas and [[Smaranath Mukti], as revealed by the Supreme Pontiff of Hinduism inspiring millions towards the Science of Hinduism.


వీడియో లింకు

Video Audio



సత్సంగం యొక్క తెలుగు అనువాద కధనం:

7 సెప్టెంబర్ 2020 ,09 : 01 pm ,సోమవారం,నిత్యానంద సత్సంగ్.

  • కైలాస నుంచి పరమశివుని సందేశం నేరుగా.
  • మనస్సు సమాజం చేత మీలో నిర్మించబడిన మెకానిజం,తనకు కావలసిన విదంగా నిరంతరంగా మిమ్మలను నడిపిస్తూ ఉంటుంది.
  • తప్పు మెకానిజం,అప్రమేయంగా మీలో పంపించిన మనస్సు ని ప్రేరేపించడం ఆపడానికి ఎవరైనా ఆ స్థాయికి ఆన్క్లచ్ చేస్తే ,పరమశివ స్థితిలో జీవిస్తారు.
  • మనస్సు అనేది మానవ సమాజం చేత అప్రమేయంగా మీలో ప్రవేశపెట్టిన మెకానిజం,దానికి కావలసిన విదంగా మిమ్మలను నడిపిస్తుంది.
  • సమాజం ఎప్పటికి ప్రేరేపించని స్థాయికి మీరు ఎవరైనా నిరంతరము ఆన్ క్లచ్ చేసుకోవాలని నిర్ణయించుకుంటే,మిమ్మలను పిచ్చిగా నడిపించలేరు.మిమ్మలను నిరంతరంగా తనకు కావలసిన మార్గంలో ఇంక ఎంతమాత్రమూ ప్రేరేపించలేదు- మీ ఆన్ క్లచ్చింగ్ యొక్క స్థాయి మిమ్మలను పరమశివుని స్థాయిని మానిఫెస్ట్ చేసేలా చేస్తుంది.
  • నేను మీకు పూర్తి సత్యాన్ని వున్నది ఉన్నట్లు ఇస్తాను.అక్కడ ఒక వాస్తవం కానీ ఉంటే,మీకు వేరేవిధంగా తెలియచేయబడి ఉంటే... ఉదాహరణకు- అక్కడ ఆకుపచ్చ లైట్ వుంటుంది,కానీ అది ఎరుపు లైట్ అని మీకు చెప్పబడింది.దానిని అసత్య సమాచారం అంటారు- అబద్ధం.
  • కానీ,ఒక విషయాన్ని సత్యమో,అసత్యమో,నిజమో అబద్దమో అని నిరూపించే సాక్ష్యం,స్వయంగా అదికూడా అనిత్యమే.
  • దానికి కూడా సమయం యొక్క పవిత్రత లేదు.దానికి కూడా స్వతంత్ర ఉనికి లేదు.ఆ విషయమంతా ,అక్కడ ఆకుపచ్చ లైట్ వుంది అనే భావన ,సత్యం,మీకు ఇవ్వబడిన ప్రతిపాదన ,మీకు ఇవ్వబడిన సాక్ష్యం ప్రకారం అక్కగా ఆకుపచ్చ లైట్ వుంది.అది నిజమైయుండ వచ్చు ,అబద్దం అయ్యి ఉండవచ్చు,సత్యం,అసత్యం. కానీ ఈ మొత్తం విషయానికి కాలం మీద ఉనికి ఉండదు.( BUT THE WHOLE THING DOES NOT HAVE ITS EXISTENCE ON TIME. )
  • అది తెలుసుకుని,మాయ నుంచి మేల్కొని, ఉదాహరణకు: ఒక విషయాన్ని అది నిజమో,అబద్దమో,సత్యమో , అసత్యమో అని తెలుసుకోవడానికి మీ జీవితమంతా వెచ్చించారు అనుకుందాము,మీరు అంతకన్నా ఎక్కువ వెళ్ళలేరు.మీ జీవితము జస్ట్ నిజము,అబద్ధము,సత్యము,అసత్యానికి సాధారణ బైనరీ - చాల సూపర్ఫీషియల్ !
  • కానీ అర్ధం చేసుకోండి.మీకు ఇవ్వబడిన ఆలోచన,మరియు మీకు అందించబడిన సాక్ష్యాలు,అక్కడ ఆకుపచ్చ లైట్ ఉందని చెప్పిన ప్రత్యక్ష సాక్షి,మరియు ఆకుపచ్చ లైట్ ఉందని మీరు గ్రహించింది, ఈ మొత్తము మాయ.మాయ మీ మీద చేసే చిలిపి పనే జీవితం.మేల్కొనండి.
  • ప్రాంక్ షోస్ లో మీరు చూసినట్లయితే,షో చివర మీరు ఎలా అయితే చూస్తారో, ఆ సహచరుడు లేచి అది ప్రాంక్ అని ఎలా చూస్తాడో.
  • సరిగ్గా అదేవిదంగా,నేను నాతో ఆన్క్లచ్ అయినప్పుడు,నేను లేచి చూసి అనుకుంటాని,ఓ గాడ్ ! ఇదంతా ఒక ప్రాంక్ అని.
  • మీరు ఆన్క్లచ్ అయ్యినప్పుడు ,ఈ మొత్తం అంత ఒక ప్రాంక్ అని మీరు తెలుసుకుంటారు.
  • ఈ ప్రళయం-మహమ్మారి కాలాన్ని ఉపయోగించుకుని ,ఇదంతా ఒక ప్రాంక్ అని తెలుసుకోండి!
  • నా జీవితం నుంచి ఒక సన్నివేశం: నా సోదరుడు ( COUSIN ) ఒకతను నేను చిన్నప్పుడే చనిపోయాడు.తమిళంలో సొంత సోదరుడికి,కజిన్ సోదరుడికి రెండు వేరు వేరు పదాలు మాకు లేవు.ఒకటే పదం సోదరుడు.మీ తల్లితండ్రులకు పుట్టినవారు సోదరులని,మీ ఆంటీ ,అంకుల్ కి పుట్టినవారు మీ సొంత సోదరులు కారు అనే ఆలోచన నేను పశ్చిమానికి వచ్చినప్పుడే నేర్చుకున్నాను,మరియు కజిన్ బ్రదర్ అనే పదం నేర్చుకున్నాను.అప్పటివరకు నాకు సోదరుడు అనే తెలుసు! అప్పటి వరకు , తమిళంలో మాకు ఆ పదం లేదు,మా కుటుంబం లో కూడా ఆ ఆలోచన లేదు.అది ఉమ్మడి కుటుంబం జీవన శైలి.
  • మానసికంగా నాకు నా తల్లితద్రులకు పుట్టిన పిల్లలు, నా ఆంటీ అంకుల్ కి పుట్టిన పిల్లలు అని వ్యత్యాసం లేదు,ఎవరికి ప్రాధాన్యత లేదు. ప్రతి ఒక్కరు సమానం.
  • ఈ పిల్లవాడు,నాకు అన్నయ్య,నా తండ్రికి అన్నయ కొడుకు- ఒక ప్రమాదంలో చనిపోయాడు.ఒక వూరు బావిలో పడి చనిపోయాడు.వేసవి శలవలకు వూరులోని బంధువుల ఇళ్లకు వెళ్తుంటాము. అది నాకు గట్టి దెబ్బ.అతను నాకు సోదరుడే కాదు,నా మొదటి అసిస్టెంట్.నా మొదటి సెక్రటరీ.అతని పేరు శ్రీనివాసన్.
  • నేను పుట్టి పెరిగిన ఇల్లు పెద్ద ఉమ్మడి కుటుంబం.ఒక పిల్లవాడు హాల్ లోనే 1 చేస్తాడు,ఇంకొక పిల్లవాడు హాల్ లోనే 2 చేస్తాడు,ఇంకొక పిల్లవాడు ఇంట్లోనే కుక్కతో దొర్లుతుంటాడు...!
  • నేను పూజ చేసుకునే సమయంలో అతను నా సెక్రటరీ మరియు బాడీ గార్డ్.ఎవ్వరు వచ్చి భంగం కలిగించకుండా.పూజ దగ్గర దీపం వెలిగించినప్పుడు ఒకరు వచ్చి ఫ్యాన్ ఆన్ చేస్తారు, ఆ రోజుల్లో ఫ్యాన్ పెడితే జనరేటర్ లాగా పెద్ద శబ్దంతో తిరిగేది.ఈ ముసలి ఆడవారు ఆ సమయంలోనే విశ్రాంతి తీసుకోవడానికి వచ్చి ఫ్యాన్ వేసేవారు.అది జనరేటర్ లాగా శబ్దం చేసేది.నేను పూజ చేస్తున్నప్పుడు ఎవ్వరు ఫ్యాన్ వెయ్యకుండా అతను చూసేవాడు!
  • అతను నాకు మంచి రక్షణ కల్పించేవాడు.ఆ పుణ్యమే ,అతని కర్మలు అన్నీ పూర్తిచేసేసాడు.అతను మూగ . చెవిటి వాడు.నా సొంత జ్ఞానం ప్రకారం అతను నాకు సేవచేయడానికి భూమిమీదకు వచ్చిన సిద్ధుడు.అతని కర్మలు ముగిసాక,తాను వచ్చిన కార్యం అయిపోయిందని తెలిసాక తన శరీరం వదిలేయాలని అనుకున్నాడు.అతను నాతో చాలా చక్కగా,చాలా దగ్గరగా ఉండేవాడు.మరియు చాల తెలివైన వాడు!
  • అతను చనిపోయినప్పుడు నేను దాన్ని తట్టుకోలేకపోయాను.అది చాలా ఎక్కువ.నేను రామసురత్ కుమార్ వద్దకు వెళ్ళాను. అయన నా గురువు. జీవితంలో క్లిష్ట పరిస్థితుల్లో మనలను రక్షించి,చూసుకోవడానికి గురువులు వున్నవారు అదృష్టవంతులు.
  • కొద్దిరోజుల క్రితం నా శిష్యులలో ఒకరు నాకు మెసేజ్ చేసారు,తన తల్లితండ్రులకు జ్వరం,కరోనా పరీక్ష చేస్తున్నారని.నేను చెప్పను,కరోనా లేదు,భాదపడవద్దు అని. ఒక రోజు తరువాత తాను మెసేజ్ చేసింది,కరోనా పాజిటివ్ అని డాక్టర్ లు చెప్పారని.నేను చెప్పను,కాదు,రిలాక్స్,నేను చెపుతున్నాను,నేను చూసుకుంటాను అని,మల్లె టెస్ట్ చేయమని వాళ్లకు చెప్పండి , అని చెప్పాను.సర్వసాధారణంగా ,కొన్ని గంటలలోనే టెస్ట్ కరోనా నెగెటివ్ అని వచ్చింది.
  • నేను అద్భుతం చేసానా లేదా అన్నది కాదు, గురువుతో ఫీలింగ్ కనెక్షన్ ఉండటం జీవితంలో మీరు అనుభవించే గొప్ప అద్భుతం.
  • నేను రామసూరత్ కుమార్ దగ్గరకు వెళ్లి,అతనికి బ్రతికించడానికి కాదు. అయన నేను తెలుసుకునేలాగా చేసారు. అయన చాలా తక్కువ మాట్లాడతారు.నా చేతిని కాసేపు పట్టుకున్నారు, ఎప్పటిలాగానే ఒక చేతిలో బీడీ,సిగరెట్ ఇంకొక చేతిలో నా చెయ్యి...
  • అయన ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే,అయన ఎప్పుడు పొగ త్రాగుతూ ఉండేవారు.కానీ నాకు ఒక్కసారి కూడా అయన దగ్గర పొగ వాసనా రాలేదు.
  • నన్ను విమర్శిస్తున్నవారికి నేను చెప్పాలనుకుంటున్నాను : మీ తిట్లు,దాడులు నాతోటే ఆపేయండి.నా గురుపరంపర జోలికి వెళ్ళకండి.
  • నేను చెపుతున్నదానికి కొన్ని వేలమంది సాక్ష్యం వున్నారు.నేను కొన్ని విషయాలు చెపుతాను.
  • యోగి రామసూరత్ కుమార్ బీడీ తాగినా,సిగరెట్ తాగినా అయన దగ్గర ఎప్పుడు పొగ వాసనా వచ్చేది కాదు,అయన అదేపనిగా పొగ తాగుతూ ఉన్నప్పటికీ.
  • ఎవరైనా దీన్ని విమర్శించేముందు,తిరువణ్ణామలై వీధులలోకి వెళ్లి ఎవరితోనైనా మాట్లాడండి.యోగి రామసూరత్ కుమార్ గారికి నేను ఒక్కడినే శిష్యుడను కాదు.ఆ వీధులలో ఎవరితోనైనా మాట్లాడండి.భౌతికంగా అయన దగ్గర గడిపినవారిని.దేవాలయం వెలుపల వీధులలో అయన జీవితం గడిపేరు.నేను చెప్పినది చూసిన వారు ,అనుభవం పొందినవారు కొన్ని వేలమంది వున్నారు.
  • మీ దాడులు,ట్రోలింగ్,ప్రతీకారం,హింస లను నా స్థాయితోనే ఆపేయండి.నా గురువు స్థాయికి వద్దు.
  • తిరువణ్ణామలై లోని రామసూరత్ కుమార్ యొక్క శిష్యులతో మాట్లాడి,వాటిని రికార్డు చెయ్యమని నేను నా ఆటోబయోగ్రఫీ టీమ్ కి చెపుతాను. రామసూరత్ కుమార్ భూమిమీద నడచిన అక్షరాలా పరమశివుని అవతారం.
  • నాకు అరోబిందో యొక్క కలను నాకు అందించడమే అయన బాధ్యత.అయన చెప్పేవారు,నేను అరోబిందో పుస్తకం చదివాను.
  • తిరువణ్ణామలై లోని ఆటోబయోగ్రఫీ టీమ్ వెళ్లి అయన శిష్యులతో మాట్లాడాలి.మరియు అయన శిష్యులు చెప్పినవి రికార్డు చెయ్యాలి,మరియు పబ్లిష్ చేయాలి.దాన్ని బట్టి మనం చెప్పినదానికి వాస్తవికతను మనం స్థాపించినట్లు అవుతుంది.
  • నేను చెప్పే రెండవ విషయం : అయన పొగని కళ్ళలోంచి,ముక్కు,చెవులు,శరీరంలోని వివిధ భాగాల ద్వారా వదిలేవారు. దీనికి కూడా చాలా ప్రత్యక్ష సాక్షులు వున్నారు.
  • మూడవది- అయన పొగ పీల్చుకుని,అయన చేతిని అయన పెంచుకునే కుక్కమీద ఉంచేవారు.కుక్క పొగ వదిలేది.నేను ఈ ప్రకటనని చాలా భాద్యతాయుతంగా చెపుతున్నాను.నేను ఇప్పుడు చెప్పిన స్టేట్మెంట్ కి చాలా మంది ప్రత్యక్ష సాక్షులు వున్నారు.
  • ఈ ప్రపంచం ఎంత సత్యమో నేను చెప్పేది అంత సత్యమే.ఒక స్పేస్ లో ఈ ప్రపంచమంతా మాయ,అప్పుడు ఆ స్పేస్ లో ఈ స్టేట్మెంట్ కూడా మాయ.
  • ఇంకొక అవగాహన :

నన్ను ట్రోలింగ్ చేయడం,విమర్శించడం అదంతా వేరే. కానీ నా గురువులని కానీ,గురుపరంపర నీకాని ఏ విదంగా అయినా అగౌరపరచినా,ట్రోల్ చేసినా చాలా చెడ్డ కర్మలను పోగుచేసుకుంటారు. అది వారి ఇష్టం.

  • మీ జీవిత క్లిష్ట పరిస్థితులలో మీకు గురువు ఉండటం అదృష్టం.
  • నేను ఎందుకొన్న కష్టాలలో ఒకటి నా సోదరుని మరణం.నేను నా గురువు రామసూరత్ కుమార్ వద్దకు వెళ్ళాను.అయన నా చెయ్యి పట్టుకున్నారు,అయన ఏమి మాట్లాడలేదు.అయన బీడీనో ,సిగరెట్టో కాలుస్తున్నారు,అయన నా చెయ్యిని పట్టుకున్నారు.నేను చాలా స్పష్టంగా చూడకలిగాను. అయన నా చేతనస్థితిని పెంచుతున్నారు.
  • ఒక పాయింట్ దగ్గర అయన నా చేయిని నొక్కి ఇలా అన్నారు,' కూతు డా ',అంటే ఇదంతా ఒక 'లీల'.
  • నేను మీకు చెపుతున్నాను: పుట్టుక,జీవితం,మరణం అనే ఆలోచనలు అన్నీ జస్ట్ లీల అని నేను అక్షరాలా చూసాను!
  • నా కజిన్ బ్రదర్ చనిపోవడం వాస్తవం,కానీ అంతిమంగా ,జీవితం,పుట్టుక,మరణం అనే ఆలోచన తప్పు.కాబట్టి ఇది ఒక మాయ.నేను జస్ట్ మేల్కొన్నాను!
  • జననం,మరణం,జీవితం అనే మొత్తం ఐడియా అంత మాయ మనమీద ఆడుకునే ప్రాంక్ .
  • ఈ రోజు సత్సంగ్ యొక్క సారంశాము: మాయను మించి వెళ్లే స్థాయికి ఆన్ క్లచ్ అవ్వండి. మరియు పరమశివ స్థాయిలో స్థిరంగా వుండండి.

ఫేస్-బుక్ పేజీ లింకులు

https://www.facebook.com/ParamahamsaNithyananda/posts/4325895950831555
https://www.facebook.com/srinithyananda.swami/posts/1749094995245492