సెప్టెంబర్ 04 2020
పేరు
మీ చైతన్యాన్ని పెంచే రహస్యాలు || పరమశివోహం S11 || స్వచ్ఛమైన ప్రశ్నలతో సంపూర్ణత్వం
కథనం
The Supreme Pontiff of Hinduism, Jagatguru Mahasannidhanam, His Divine Holiness expounded on the cosmic principle, 'Secrets to Raise Your Consciousness' during the Nithyananda Satsangh. The Darshan for today was Nataraja Bhava Darshan.
Contributing to over 108 humanitarian causes of Shrikailasa Uniting Nations, KAILASA's Nithyananda Hindu University marks today as Season 3, Day 9 of Paramashivoham with over 1200 delegates across 20 countries participating in the convention. One of the major highlights of KAILASA’s contributions through this convention is Power Manifestation, today being the Power of Consciousness over Matter
Sanyasis of the Nithyananda Order of Monks and initiated Acharyas worldwide, affiliated with the Department of Education of KAILASA conducted a series of seminars focusing on the attributes of the Ishavasya Upanishad, Keno Upanishad, Brahma Sutras and Completion with Pure Questioning as revealed by the Supreme Pontiff of Hinduism inspiring millions towards the Science of Hinduism.
వీడియో
ఆడియో: మీ చైతన్యాన్ని పెంచే రహస్యాలు II 4 సెప్టెంబర్ 2020 II
సత్సంగం యొక్క తెలుగు అనువాద కధనం
4 ,సెప్టెంబర్,2020 || 8 .05 pm || నిత్యానంద సత్సంగ్ ||
- పరమశివుని సందేశం కైలాసంనుంచి నేరుగా .
- గట్టి పట్టుదల మిమ్మలను జాగృత స్థితి నుంచి అవెకెన్ ( AWAKENED ) స్థితికి,మరియు అవెకెన్ స్థితినుంచి సజీవ స్థితికి పెంచుతుంది.
- చేతన స్థితికి 5 స్థితులు ఉంటాయి.
జాగృత స్థితి,ప్రస్తుతం మీరందరూవున్నా స్థితి. జాగృత స్థితికి క్రింద స్వప్న స్థితి. స్వప్న స్థితి క్రింద శుషుప్తి స్థితి ఉంటుంది. జాగృత స్థితి కి పైన తురీయా స్థితి ఉంటుంది. మరియు చివరగా తురీయాతీత స్థితి.
- మీ చేతన స్థితి యొక్క ఈ 5 స్థితులే మీ జీవితం.
- తీవ్రమైన జాగృత స్థితి మిమ్మలను తురీయాతీత స్థితికి తీసుకువెళ్తుంది.
- మీరు భావిస్తున్న బాహ్యంగా మీరు సాధించినవి కానీ ,బాహ్య సామర్ధ్యాలు కానీ మిమ్మలను నిర్వచించలేవు.అవన్నీ మీ కీర్తులలో ఒకటి కానీ అవి మీ యొక్క నిర్వచనం కాదు.
- మీరు ఏ స్థితిలో అయితే మీగురించి మీరు ఆకర్షణీయంగా ఫీల్ అవుతారో,అదే మీగురించి నిర్వచనం. మీరు ఏ స్థితి లో అయితే మీకు మీరు ఆకర్షణీయంగా ఫీల్ అవుతారో అదే ముఖ్యమైనది.
మీరు అస్తమాను నిదురపోతూ ఉంటే,మీగురించి మీరు అందంగా అనుభూతి పొందగలరా? మీ స్వప్న స్థితిని మీరు చాల ఆకర్షణీయంగా అనుభూతి పొందగలరా? మీ చేతన స్థితిని మీరు చాలా ఆక్షర్షణీయంగా అనుభూతి పొందగలరా? మీ శక్తివంతమైన స్థితిని,సజీవత్వాన్ని మీరు చాలా ఆకర్షణీయంగా అనుభూతి పొందగలరా?
- మీ ఆకర్షణీయ అనుభూతి గురించి పదాలు అల్లడానికి మీ శక్తిని వృధా చేయడం ఆపండి.
- ప్రపంచమంతా విసుగెత్తిపోయి వుంది! ఎవ్వరూ వారిగురించి ఆకర్షణీయంగా అనుభూతి పొందటం లేదు.వాళ్ళు మీమీద ఆకర్షణీయంగా అనుభూతి ఎందుకు పొందుతారు? ప్రజలకు మీమీద ఆకర్షణీయంగా అనుభూతి పొందేలా చేయడానికి మీరు పెడుతున్న శక్తి ,సమయం,సంపద,ప్రతిభ ,ఈ చెత్తను చెత్తబుట్టలో వేయండి.
- ఏ స్థితిలో మీగురుంచి మీరు ఆకర్షణీయంగా అనుభూతి పొందుతున్నారో ,జీవితం అంటే అదే !
- మీ స్థితిని పరిపక్వము చెందనివ్వండి.
- మీ స్థితి- ఏ చేతన స్థితిలో మీగురించి మీరు ఆకర్షణీయంగా అన్నిభూతి పొందుతారో,అది పరిపక్వము చెందాలి.
- ప్రాధమిక దశలో నిదురను మీరు ఆకర్షణీయంగా అనుభూతి పొందుతారు.అంగప్రదక్షణ లాగా పడక మీద దొర్లుతారు.లేదా స్వప్న స్థితి లో మీరు మీకు ఆకర్షణీయంగా అనుభూతి పొందుతారు.అందుకే బద్ధకం మీ జీవితంలో ఒక భాగమే కాదు,మీ జీవితంలో పార్ట్ మరియు పార్సెల్ ! అదే జీవన శైలి.
- ఒక వ్యక్తి తన అత్యుత్తమ చేతన స్థితిని తన ఆకర్షణీయంగా అనుభూతి పొందుతారో వారు పరిపక్వము చెందిన వ్యక్తి.అది కొన్ని నిముషాలు అయినా ,మీరు మీ చేతన స్థితిని ,సజీవ స్థితిని ఆకర్షణీయంగా అనుభూతి పొందితే,అదే చాలు.
- నేను ఉదయం పూజ దగ్గర కూర్చున్నప్పుడు నాకు నేను ఆకర్షణీయంగా అనుభూతి పొందుతాను.నేను నా పూజలో వున్నప్పుడు నేను ఖచ్చితంగా ఎలా అనుభూతి పొందుతానో మీకు వివరిస్తాను: నేను నా లాగా ఫీల్ అవుతాను,పరమశివ లాగా ఈ శరీరంలో కూర్చుని ఉన్నట్లు.అది నా రెండు ( IT IS BOTH ME ) .నా సొంత ఉనికిని ,నా వ్యక్త,పూజిస్తున్నట్టు,సంబరం చేసుకుంటున్నట్లు.నా వ్యక్త నా అవ్యక్తను పూజిస్తున్నట్టు.
- నా సర్వాన్ని నా భాగం పూజిస్తుంది.కాబట్టి ఇప్పటికి కూడా కొన్ని సార్లు నేను 5 -6 గంటలు కూర్చుండిపోతాను.నేను సాధారణంగా కూర్చుంటాను,ఒకరి తరువాత ఒకరు,నేను ప్రతి దేవునితో వివరంగా మాట్లాడతాను.వారు ప్రతి భగవంతుడు అని ఆలోచనకన్నా,వారు పరమశివుని మానిఫెస్టేషన్ అని .
- చేతన స్థితి యొక్క 5 స్థితులు.
ఈ 5 స్థితుల పెర్ముటేషన్ మరియు కాంబినేషన్ 25 స్థితులకు దారితీస్తుంది.కానీ ఈ 5 స్థితులు చేతనస్థితి యొక్క ప్రాథమిక ప్రత్యేక స్థితులు.
- మీ జీవితం,మరణం,శృంగారం,ఐశ్వర్యం,జీవిత ఉద్దేశం,జీవిత లక్ష్యం, జీవిత విధానం అన్నీ మీ ఉనికి యొక్క ఆచరణ మొదలుపెట్టిన స్థితి మీద ఆధారపడి మారుతుంటాయి.
- మీ ఉనికికి మంచి మార్గం స్వప్న స్థితి అని మీరు ఆచరిస్తే,మీరు ఎక్కువగా మారకద్రవ్యాలకు,పోర్నోగ్రఫీ కి బానిసలు అవుతారు. మాయ ప్రేరేపిత జీవనశైలి .
- మీరు మాయ ప్రేరేపిత ఉత్పత్తులకు,వస్తువులకు,సేవలకు,పోర్న్,మారక ద్రవ్యాలు,మొదలగు వాటికీ ఎక్కువగా బానిసలు అవుతారు.అది యాదృచ్చికం అనికోవద్దు.అవి రెండు ఎప్పుడు కలిసే ఉంటాయి.రెండు స్వప్న ప్రేరేపితాలు.రెండు ఒకేవిధమైన స్థితిని ప్రేరేపిస్తాయి-మరకద్రవ్యాలు మరియు పోర్నోగ్రఫీ.
- మీరు అనుభవించే స్థితి ఉత్పత్తులను,జీవనశైలిని,అవసరాన్ని,లక్ష్యాన్ని నిర్ణయిస్తుంది.వీటిని అన్నిటిని మీరు మీ జీవితంలో వినోదపరుస్తూ నిమగ్నమైపోతారు.
- ఎవరైతే వారి స్వప్న స్థితిని,శుషుప్తి ని ఆనందిస్తారో వారు వేప రసాన్ని,ఆముదాన్ని భరించలేరు.మీరు వేపరసాన్ని,ఆముదాన్ని ఆస్వాదించ కలిగితే మీ శరీరము మిమ్మలను స్వప్న స్థితిని,శుషుప్తి స్థితిని ఆనందింప చేయనీయదు.
- మీరు గరిష్టంగా ఎంత ఆస్వాదించగలరో మీ శరీరము అంతవరకే చేయనిస్తుంది.గరిష్టంగా 3 - 4 గంటల నిద్ర.
- మీరు ఈకొన్ని మూలికలను రోజు తీసుకుంటే
అతి మధురం వేప రసం ఆముదం మాలిక్ ఆసిడ్ మీకు 3 -4 గంటల స్వప్న స్థితి అవసరం ఉండదు.
- అతి మధురం మరియు మాలిక్ ఆసిడ్ మీ కండరాలను శక్తివంతంగా పునర్ నిర్మాణం చేస్తుంది.మీ నాడీ వ్యవస్థ చైతన్యవంతంగా ఉంటుంది.
- నా శిష్యులందరిని గట్టిగా చెపుతున్నాను,ఈ కొన్ని వస్తువులను మీ ఆహారంలో ప్రత్యక్షంగా కానీ,పరోక్షంగా కానీ ఉపయోగించాలి.మీరు వేపరసం తీసుకోలేకపోతే ఆర్గానిక్ వేప టాబ్లెట్ లను వాడండి.
- మీ చేతనస్థితి యొక్క నాణ్యత పెరుగుట మొదలవడం మీరు చూస్తారు.మీ చేతనస్థితి నాణ్యతకు ఆహారానికి ప్రత్యక్ష భాద్యత ఉంటుంది.
- నా గురువు నాకు బోధించిన ఆల్కెమీ శాస్త్రం యొక్క పురాతన గ్రంధాలను ఏర్పాటు చేయడానికి నేను పెద్దఎత్తున పని చేస్తున్నాను.
- మానవాళికి సహకరించడానికి హిందువులకు గొప్ప విషయం వున్నది.
- చేతన స్థితి వివిధ స్థితుల యొక్క ఆల్కెమీ శాస్త్రం హిందూ సంప్రదాయంలో ప్రత్యేకమైనది.కేవలం కొన్ని మూలికల ద్వారా చేతనస్థితి యొక్క ఉత్తమ స్థితిని ప్రేరేపించే వచ్చు,డ్రగ్స్ కాదు!
- స్వచ్ఛమైన ధ్యానం మరియు మూలికల ద్వారా చేతనస్థితి యొక్క ఉత్తమ స్థితిని ప్రేరేపించవచ్చు.ఆ ఉత్తమ చేతనస్థితిలో మీరు ఏదైతే చూస్తారో అది ప్రత్యక్షంగా మీలో శక్తి లాగా మానిఫెస్ట్ అవుతుంది.
- నాదగ్గర వున్న సన్యాసి డాక్టర్లు ,నాకు దగ్గరగా వున్న శిష్యుల లిస్ట్ నాదగ్గర వుంది,వాళ్ళు కూర్చుని జరిగేవన్నీ రాస్తున్నారు.
- అతి మధురం మిమ్మలను శక్తివంతంగా చేస్తుంది.నేను ఇప్పటికే హైపర్ బేబీ లాగా వున్నాను.అతిమధురం తో ఏమి జరుగుతుంది?
- నేను 2 -3 గంటలు విశ్రాంతి తీసుకున్నా,కొన్ని పెద్ద 6 -7 ప్రాజక్టు లు డౌన్లోడ్ అవ్వబోతున్నాయి, రివీల్ అవ్వబోతున్నాయి అని నా టీమ్ కి తెలుస్తుంది.
- సంపద అంటే,ఉత్తమ చేతనస్థితిలో మీరు గడిపే సమయంగురించే అది అంతా.ఉత్తమ చేతన స్థితిలో మీకు వ్యవస్థతో పని ఎలా చేయాలో తెలుస్తుంది.మీకు డబ్బు,సంపద,పలుకుబడి,ఏదైనా కావాలని కోరుకుంటున్నారో మీకు ఆ విధానం మీకు తిన్నగా తెలిసిపోతుంది.
- హిందువులయొక్క శక్తి ఏమిటి అంటే,చేతనస్థితి యొక్క ఉత్తమ స్థితిని రోజులో ఎక్కువ గంటలు నిలుపుకుని వుండే సామర్ధ్యం ఉంటుంది.అందువలన వారు ఎక్కడికి వెళ్లినా,హిందువులు ధనిక సంఘం గా వుంటారు.
- ప్రతిరోజు తడి టవల్ ని కడుపుమీద వేసుకుని పడుకోండి.మిమ్మలను ఉత్తమ చేతన స్థితిలో ఉంచేలా అది కూడా పెద్ద మార్గంలో ఉపయోగ పడుతుంది.పడుకునే ముందు ఐస్ ముక్కలు కానీ,తడి టవల్ కానీ కడుపుమీద వేసుకోవడం,సూర్యాస్తమయం తరువాత ఏమి తినకపోవడం.
- మీరు ఇవి కానీ అనుసరిస్తే ,మీ ఉత్తమ చేతనస్థితిలో పెరుగుదల కలుగుతుంది.
- మానవులు ఎవరైతే రోజు అంతా జాగృత ,తురీయా స్థితిలో మరియు సజీవ స్థితి,తురీయాతీత స్థితి లో నివసించడం మొదలుపెడతారో, ఆ పిల్లలని కానీ,ప్రజలను కానీ విద్యేశ్వర,మంత్రేశ్వర,లోకేశ్వర,ఆస్త్రేశ్వర ,ఈ-డిప్లొమాట్ లా ఉండాలని నేను కోరుకుంటున్నాను.
- అందుకే నేను ఈ శాస్త్రాన్ని నిరంతరంగా భోదిస్తున్నాను,అందువలన మీరు కైలాస పరిపాలనలో భాగం కాగలరు.
- నేను చేసే ప్రతీ పని ,నేను ఇచ్చే ప్రతీ సత్సంగ్ కి నాకు కారణం వున్నది.
- కైలాస పరిపాలకి,కైలాస ప్రభుత్వానికి భాగం కాగల ప్రజలగురించి నేను సీరియస్ గా చూస్తున్నాను.
- ప్రపంచం మొత్తంలో మతపరమైన,ఆధ్యాత్మిక అవసరాలను నిర్వహించడానికి కైలాస ప్రభుత్వానికి చాలా పెద్ద భాద్యత ఉన్నదై. ముక్యంగా 200 కోట్ల మంది హిందువులమీద ద్రుష్టి పెట్టాలి.ఇది చాలా పెద్ద భాద్యత!
- హిందూ మతంలో పుట్టి,సాధన చేస్తున్న ,నేను సుమారుగా లెక్కవేసింది ప్రపంచం మొత్తం మీద 2 బిలియన్ లు, చాలా వ్యవస్థీకృత మార్గంలోవారికీ అన్ని ఆధ్యాత్మిక,మతపరమైన అవసరాలకు సహాయం చేయడం మన బాధ్యత.
- ఇది చాలా పెద్ద పని ! కాబట్టి మనకు 24 /7 చాలా చాలా చురుకుగా,హుషారుగా వుండే ప్రజలు కావాలి.ఎవరైతే మానవులకు సహాయం చెయ్యాలి అనుకుంటారో,ఎవరైతే ప్రపంచాన్ని ఎన్రిచ్ చెయ్యాలి అనుకుంటారో వారు.
- నేను కూడా కైలాసని లౌకిక స్వభావము ( SECULAR NATURE ),ఆధ్యాత్మిక స్వభావము( SPIRITUAL NATURE ) అనే రెండు వ్యవస్థల క్రింద విభజించుదాము అనుకుంటున్నాను.
- ఆధ్యాత్మిక స్వభావము: శక్తివంతమైన ప్రజ్ఞానాన్ని బోధించడం,ప్రజలకు శక్తులను మానిఫెస్ట్ చేయడంలో సహాయపడటం.
- లౌకిక స్వభావం: వెబ్సైటు లను నిర్మించడం,సంస్థ నిర్మాణాన్ని వృద్ధి చేయడం,ప్రపంచమంతా వాస్తవికతను తయారుచేయడం,( MAKING ENTITIES ALL OVER THE WORLD.) ఇదంతా లౌకిక స్వసభావము చేసే పని,అది జీతానికి పనిచేసే వారుకూడా చేయవచ్చు.నియమించుకున్న వ్యక్తులు.
- కానీ ఆధ్యాత్మిక పని మాత్రం సన్యాసులు,లేదా కైలాసకి పూర్తి సమయం అంకితం చేసిన వారు మాత్రమే చేయగలరు.నేను శక్తివంతమైన దీర్ఘకాలిక నిర్మాణాన్ని అభివృద్ధి చేస్తున్నాను.
- జాగృత స్థితిని,సజీవ స్థితిని మనుభవం పొందినవారు మనకు చాలామంది కావాలి-ఆధ్యాత్మిక పని చేయడానికి సన్యాసులు,గృహస్థ లు,పూర్తి సమయం కేటాయించే కైలాసవాసులు కావాలి.
మాండూక్య ఉపనిషత్తు లో 7 పద్యం ఇలా చెపుతుంది:
शान्तं शिवमद्वैतं चतुर्थं मन्यन्ते स आत्मा स विज्ञेयः శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజేయహ్: అనువాదం- తురీయా శాంతి స్థితి,శివ స్థితి,అద్వైత స్థితి.దానిని తురీయా స్థితి క్రింద పరిగణించాలి.అది `రియల్ సెల్ఫ్`.అది గ్రహించాలి,అనుభవం పొందాలి.
- ఈ స్థితి ని గ్రహించి న చాలా చాలా మంది మనకు కావాలి.కైలాసని నిర్వహించడానికి ఈ స్థితిని అభివృద్ధి చేసుకున్న వారు.
- ఈ ఆధ్యాత్మిక పరిపాలనకు భాగం అవ్వాలనుకునే సన్యాసులు,బ్రహ్మచారులు,బ్రహ్మచారిణులు,బాలసంత్ లు ఇప్పటినుంచే ఇది సాధన చేయడం మొదలుపెట్టండి.మొదలుపెట్టండి! ఎందుకంటె త్వరలో నేను శిక్షణకు మీ అందరిని ఒకచోట చేరుస్తాను.
- ఒక్క ఆధ్యాత్మిక పని చేయడానికే మనకు 10000 మంది కావాలి.వెబ్సైటు ని నిర్మించడం,బ్యాంకు,మౌలిక సదుపాయాలు. మనం నియమించుకోవచ్చు,మరియు మనం ప్రత్యేక అనుమతి ( FRANCHISE ) కూడా ఇవ్వవచ్చు.
- కానీ ఆధ్యాత్మిక పని మాత్రం FRANCHISE కి ఇవ్వలేము.మనం నియమించలేము.
- హిందూ పార్లమెంట్ లో ,కైలాస నిర్వహణ లో భాగం అవ్వడానికి తురీయా ,మరియు త్రియాతీత స్థితులను చవిచూసిన వేలమంది నిజంగా,నిజంగా,నిజంగా అవసరము వున్నది.హిందువుల యొక్క ఆధ్యాత్మిక అవసరాలు.
- ఈ మూడు పుస్తకాలు ప్రాథమిక పరిచయం పుస్తకాలు కాబోతున్నాయి.
శ్రీ రామ చంద్ర ప్రభు చేత రచింప( సంకలనం) చేయబడిన 108 ఉపనిషత్తులు. శ్రీకృష్ణ చేత రచింప ( సంకలనం) చేయబడిన భగవద్గీత . వ్యాసుఁని చేత రచింప ( సంకలనం) చేయబడిన బ్రహ్మసూత్రాలు.
- ఈ మూడు పుస్తకాలు కైలాసకి ప్రాతిపదికగా ,కైలాసకు పరిచయ పుస్తకాలు కాబోతున్నాయి.
- ఈ మూడు పుస్తకాలు వేదాలు,ఆగమాలు మీద పాతుకుని ,కేంద్రీకృతమై వున్నాయి.ఈ మూడు కైలాసకి,హిందుత్వానికి పరిచయం
- ఈ శాస్త్రంలో అనుభవం వున్న ఎక్కువమంది మనకు కావాలి,అప్పుడు దీనిని ప్రపంచంతో పంచుకోవచ్చు.
- దేశ నిర్మాణం నియమించుకున్న ప్రజలతో చేయించ వచ్చు,కానీ జీవన్ముక్త నాగరికత నిర్మాణం ఒక్క జీవన్ముక్తి పొందినవారి వలననే జరుగుతుంది.
- కైలాసంలో రెండు వరుసలు ఉంటాయి: జీవన్ముక్త నాగరికత మరియు దేశం.
- నేను పుట్టినదగ్గరనుంచి జీవన్ముక్త నాగరికతను పునరుర్ధరించడానికి పనిచేస్తున్నాను.గత 26 సంవత్సరాలుగా,నాకు 16 వయసునుంచి కైలాస దేశాన్ని పునరుర్ధరించడానికి పనిచేస్తున్నాను.
- కైలాస - దేశం,మౌలిక సదుపాయాల నిర్మాణం నియమించుకున్నవారితో నైనా నిర్మించవచ్చు.
- కానీ కైలాస - తురీయా,తురీయాతీత తమలో తాము అనుభవం పొందినవారి వలన మాత్రమే జీవన్ముక్త నాగరికత నిర్మితమవుతుంది.
- కాబట్టి అనుభూతి చెందడం ఆపండి.ఇతరులను మీ గురించి ఆకర్షణీయంగా( CUTE ) ఉన్నట్లు ఫీల్ అయ్యేలా చేసే పనిని ఆపండి.ఇతరులను మీ గురించి క్యూట్ గా ఉన్నట్లు ఫీల్ అయ్యేలా చేసే ఆలోచనను ఆపండి.మీ సొంత తురీయా,తురీయాతీత స్థితుల గురించి క్యూట్ గా ఫీల్ అవ్వండి.దానికోసం పనిచేయండి.ఇతరులు మీ గురించి క్యూట్ గా ఫీల్ అవ్వాలి అనే దానిమీద పనిచేయడం ఆపండి,ఫీల్ అవ్వడం ఆపండి,ఆశించడం ఆపండి.వద్దు! కాలాన్ని వృధా చేయ వద్దు.
- మానవులందరు పీకలలోతు చెత్తతో విసిగిపోయి వున్నారు.వారి గురించి వారే క్యూట్ గా ఫీల్ అవ్వరు,మీ గురించి క్యూట్ గా ఎందుకు ఫీల్ అవుతారు?
- ఇతరుల అభిప్రాయాలను చెత్తలో వేయండి.మీ ఉత్తమ చేతనస్థితి గురించి క్యూట్ గా ఫీల్ అవ్వడానికి నిర్ణయించుకోండి.మరియు మీ చేతనస్థితిని పెంచుకోవడం మొదలుపెట్టండి.అంతిమదాన్ని సాధించడానికి ఇది ఒక్కటే మార్గము.
ఈ సత్సంగ్ చూడాలంటే https://www.youtube.com/watch?v=42YT-HcIpA4
ఛాయాచిత్రాలు
ఫేస్-బుక్ పేజీ లింకులు
https://www.facebook.com/ParamahamsaNithyananda/posts/4313133728774444
https://www.facebook.com/srinithyananda.swami/posts/1744115072410151
https://www.facebook.com/pg/ParamahamsaNithyananda/photos/?tab=album&album_id=4272146499539834&__tn__=-UC-R