జూన్ 30 2020

From Nithyanandapedia
Jump to navigation Jump to search

పేరు

మనమందరం చాలా నిర్ణయాత్మకంగా ఉన్నాము, అనుకోకుండా కాదు || పరమశివోహం-S7 || శ్రీ వెంకటేశ్వర భావదర్శనం ||సంపదకు సంబందించిన స్పృహ ||

కథనం

The Supreme Pontiff of Hinduism, Jagatguru Mahasannidhanam, His Divine Holiness, Bhagavan Nithyananda Paramashivam expounded on the cosmic principle You, I and the Universe - We are All Consciousness! during the everyday live public talk, Nithyananda Satsang. His Divine Holiness (HDH) shared that all of us are here with a conscious purpose and we all exist very decisively, not accidentally. He shared that the post-Corona world is going to be a Conscious World Order, Satya Yuga, and we all must consciously approach the impact of Corona on life and livelihood.

Contributing to over 108 humanitarian causes of SHRIKAILASA Uniting Nations, KAILASA's Nithyananda Hindu University marks today as Season 7, Day 7 of Paramashivoham. One of the highlights of KAILASA’s contributions through this convention is Shaktinipada along with Power Manifestation, today being the Power of Mind Reading. The Darshan for today was Venkteshwara Bhava Darshan.

Sanyasis of theNithyananda Order of Monks and initiated teachers Acharya worldwide, affiliated with the Department of Education of KAILASA conducted a series of seminars focusing on the Truths of Wealth, Wealth Consciousness, Economics of KAILAASA, Thyaga as a way to go beyond Ego and Karma, and Niluvu Dhopudi, as revealed by the Supreme Pontiff of Hinduism inspiring millions towards the Science of Hinduism.

సత్సంగం

Video



అదనపు వీడియో(లు)

Video



Video



సత్సంగం యొక్క తెలుగు అనువాద కధనం

30 జూన్ ,2020 మంగళవారం రాత్రి 11 గం 17 ని పరమశివోహమ్ లెవెల్ 2 ,7 వ సీజన్ ,7 వ రోజు,ఇంగ్లీష్ సారాంశం

  • ఇది పరమశివునిచే ప్రత్యక్షంగా ఇవ్వబడిన సందేశం.
  • నేను పరాశక్తినుంచి,మహామయి నుంచి,పరమశివ నుంచి ప్రత్యక్షంగా స్వీకరించిన 5 ప్రధాన సూత్రాలగురించి వివరిస్తాను.
  • విశ్వం చేతనస్థితిలో వుంటుంది.ఇది చాలా ముఖ్యమైన ,గొప్ప సత్యం.
  • మనమందరమూ ఒక ప్రయోజనం ( Conscious purpose ) కోసం ఇక్కడ వున్నాము.మనం ప్రమాదవశాత్తూ రాలేదు.మానవజాతికి జరిగిన చెడు విషయాలలో ఒకటి ఏమంటే ,మనం ప్రమాదవశాత్తూ వచ్చామని నమ్మించడం,మన ఉనికి చాలా చిన్నది అని .. అది కాదు.
  • మీరు చేతన స్థితి,నేను చేతన స్థితి,విశ్వం చేతన స్థితి.మీరు నాతో కనెక్ట్ అయ్యేరు అనే భావనకు కారణం వుంది.నేను రోజు వచ్చి మీతో కూర్చుంటున్నాను,దానికికూడా కారణం వుంది.మన మధ్య సంబంధం చాలా మధురమైనది,బలమైనది,ప్రేమతో కూడుకున్నది,మక్కువతో కూడుకున్నది,చేతన స్థితిలో వున్న సంబంధం.చేతనస్థితి అన్న పదం తప్ప మిగిలిన పదాలన్నీ చాలా చిన్నవి."చేతన స్థితి " ,అదే నిజమైన పదం.
  • మనం చేసినదిఅంతా పోలేదు. ప్రపంచానికి మీరు చేసిన శక్తివంతమైన,క్రియాశీలకమైన సహకారం,అది మీరు తెలిసి చేసినదైనా,నిర్ణయాత్మకంగా చేసినదైనా అది ఎప్పటికి పోదు.మంచి అయినా,చెడు అయినా.
  • మన మనుగడ నిర్ణయాత్మకమే,ప్రమాదవశాత్తూ కాదు.కాబట్టి మనం అందించే సహకారం ,మంచి కానీ చెడు కానీ అది చనిపోదు.
  • క్రింది స్థాయిలో,జంతు స్థాయిలో మీరు చేసిన మంచి కి అంతా మీరు ఆనందించాల్సిందే.మీరు చేసిన చెడుకి మీరు భాదపడాల్సిందే.
  • మానవ స్థాయిలో మీరు చేసిన మంచి వలన మీరు చేసిన చెడుని అంతా తొలగించుకోవచ్చు.
  • మీరు దైవ స్థాయికి ఎదిగినప్పుడు ,మంచి కానీ చెడు కానీ మీమీద ప్రత్యక్షంగా ఫలితం ఉండదు.ఎందుకంటె మీరు దానిని మీగురించి చేయడం లేదు కాబట్టి.కానీ అది సామూహిక ఫలితాన్ని ఇస్తుంది.
  • ఉదాహరణకి జంతు స్థాయిలో మీరు 5 మందికి ఆహారం ఇచ్చారనుకోండి,దానికి తగ్గ పుణ్యం వస్తుంది ,దాని ఆనందాన్ని మీరు అనుభవించాలి .దాన్ని మీరు ఆపలేరు.మీరు ఎవరినైనా భాదపెడితే మీరు ఆ బాధని అనుభవించాలి.మీరు మంచినికాని, చెడుని కానీ ఆపలేరు.మంచి చేస్తే స్వర్గంలో కాలం గడుపుతారు,చెడు చేస్తే నరకంలో గడుపుతారు.
  • మానవ స్థాయిలో మీరు కొంచం స్థాయిని పెంచకలిగితే ,మీరు కొన్నిటిని రద్దుచేయగలరు.ఒక వ్యక్తి ఐదుగురిని భాదపెడితే వచ్చిన పాపం ఐదుగురికి మంచి చేయనిస్తే ఈ పాపం పోతుంది అని చెపుతారు.మీరు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే ,చేసిన పాపానికి శిక్షని అనుభవించనవసరంలేదు.
  • దైవ స్థాయిలో మంచి చేస్తే పుణ్యం కానీ,చెడు చేస్తే పాపం కానీ రాదు.ఎందుకంటె అతను వాటిని తన వ్యక్తిగత లాభంకోసం చేయడంలేదు కాబట్టి.తాను లోకకల్యాణం కోసం చేస్తారు.కాబట్టి ఫలితంకూడా లోకానికే వెళ్తుంది.అయన వ్యక్తిగతంగా భాదపడడు.
  • అది కృష్ణ నిర్ణయం లాంటిది.అయన నిర్ణయాలలో మంచి వలన కానీ,చెడువలనకాని వచ్చిన ఫలితాలకు అయన ఎప్పుడు బాధపడలేదు.ఎందుకంటె అయన చేసేది లోకకల్యాణం కోసమే కాబట్టి.ఆయనకు వ్యక్తిగతంగా బాధ ఉండదు.అదేవిదంగా రాముని విషయంలో.అయన నిర్ణయాలు ఎక్కువ ప్రజలగురించే ఉంటాయి . అందుకే వచ్చే ఫలితాలవలన అయన భాద పడరు
  • దైవ స్థాయి లో మీ నిస్వార్ధత వలన మీ చర్యలు ప్రతిచర్యలు,మంచి చెడులవలన వచ్చే ఫలితాల ప్రభావం మీమీద ఉండదు.అది మీరు నిర్ణయించుకున్న సమాజానికి వెళ్తుంది.
  • మీ స్థాయిని ఎలా పెంచుకోవాలి ?
  • జంతుస్థాయిలో మీరు ఈ ప్రపంచం యొక్క ఆలోచనలకు చాలా కట్టుబడి వుంటారు.చాలా స్వార్ధం,మీ శరీరంతో గుర్తింపుకోసం,చాలా పదార్ధ ఆధారిత తత్వం తో వుంటారు.అంటే మీ విలువను తెలుసుకొనడానికి ఎప్పుడు మీ డబ్బును లెక్కపెట్టుకుంటూ వుంటారు.మీరు జీవించే జీవితం యొక్క లోతుకు విలువలేదు.మీ బ్యాంకు లో వున్న డబ్బుకన్నా మీ జీవిత లోతు ( depth of your life ) చాలా గొప్పది
  • డబ్బుకన్నా జీవితం చాలా గొప్పదని కరోనా ప్రపంచానికి అర్ధం అయ్యేలా చేసింది.జీవిత లోతు చాలా విషయాలను చేరుస్తుంది.డబ్బుని చేర్చలేదు.కాలమంతా కబ్బుకోసమే గడిపేరు.ఇప్పుడు జీవితం పోయింది,డబ్బుపోయింది.కరోనా దాన్ని తీసేసింది!
  • మీరు బయట సంపాదించిన వనరులకన్నా జీవిత లోతు కొన్ని మిలియన్ రెట్లుగొప్పది.డబ్బు మొత్తం ఒక సామజిక సంబంధం .ఇప్పుడు ఇది అంతా పోయింది.సామజిక సంబంధం వున్నా ఇప్పుడు మీరు ఏమి చేయగలరు?
  • సామజిక సంబంధాలు అన్నీ కరిగిపోతున్నాయి .ఆరు నెలలలో నేను చెప్పింది మీరు అర్ధం చేసుకుంటారు.కరోనా కి ముందు ఉన్నట్లు ప్రపంచం ఇంక ఉండబోదు.
  • ప్రతిఒక్కటి యదాస్థితికి వస్తుంది అని మీరు ఇంకా అనుకుంటూవుంటే మీరు తీవ్ర నిరాశకు ప్రణాళిక వేస్తున్నట్లే.
  • ఆ విశ్వసాన్ని వదిలేయండి.చేతన స్థితిని పెంచుకోండి.ఇప్పుడు యదార్ధం తెలుసుకోవడానికి మేల్కొనండి.విశ్వం యొక్క చేతనస్థితిని అర్ధం చేసుకోవడానికి మీ మనసును, శరీరాన్ని నిర్మించుకోండి.
  • నేనిచ్చే సారూప్యత ( Analogy ),నేను చెప్పే సత్యాలు,నేను వివరిస్తున్న తర్కం,నేనిచ్చే ముగింపు - ఈ నాలుగు విశ్వం నుంచి డైరెక్ట్ గా వచ్చినవి.ఇవి ఏ వార్తలనుంచి కానీ,మీడియా నుంచి కానీ,గణాంకాలు కానీ,ఎవరో మానవులు సేకరించిన సమాచారం కాదు.
  • నేను సంవత్సరం క్రితం చెప్పినవి నిజమౌతున్నాయి.ఆరు నెలల క్రితం నేను చెప్పినవి నిజమవుతున్నాయి.5 నెలల క్రితం బిడది ఆధీనం వారికి చెప్పాను,ఎక్కువ రోజులకి కిరాణా సామాను నిల్వచేయమని.ఎందుకంటె మనం అన్నదానం చేయాలిఅని .ప్రతి పదం నిజమవుతుంది.నేను ఇప్పుడు చెప్పేది రికార్డు చేసి యు ట్యూబ్ లో పెడతాను.మీరే చూడండి. డిసెంబర్లో అవి నిజమౌతాయి.
  • కాబట్టి మొదటి విషయం : ప్రపంచం కరోనా ముందులాగా ఉండబోదు.కరోనా తరువాత వచ్చేది చేతన స్థితి కలిగిన సత్య - యుగ ప్రపంచము.Get ready to live the conscious world order .
  • చాలా విషయాల్లో మీరు కాలం వృధా అనుకుంటారు.మీరు వాటిని చాలా ముఖ్యమైనవని తెలుసుకుంటారు.కొన్ని విషయాలని మీరు చాలా ముఖ్యమైనవని,మనకి రక్షణ కలిగిస్తాయని భావిస్తారో అవి పనికిరావివి అని నిరూపించబడతాయి.అవి మీకు పనికిమాలిన బరువు అని నిరూపించబడతాయి.
భాగవత్గీత- చాప్టర్ -3 ,శ్లోకం 22 

NA ME PARTHASTI KARTAVYAM TRISU LOKESU KIMCANA < NANAVAPTAMAVAPTAVYAM VARTA EVA CAKARMANI ! ప్రీత కుమారుడా , ఈ ముల్లోకాలలో నాకు సూచింపబడిన పని ఏమి లేదు.నాకు దేనిమీదా కోరిక లేదు.నాకు దేనినైనా పొందాలని అవసరమూ లేదు.ఇంకా నాకు కొన్ని పనులు చేయడానికి నిశ్చయింపబడ్డాయి.

  • నేను ఇక్కడ ప్రపంచానికి చేతన స్థితికి పురోగతిని కల్పించడానికి వున్నాను.ఈ అచేతనమైన జీవనశైలి ఇకముందు పనికిరాదని కరోనా ప్రపంచానికి అర్ధమయ్యేలా చేస్తున్నది.
  • భూగోళం ఇంక ఈ మోసపూరితమైన,అచేతనమైన,మాయ మాట్రిక్స్ జీవన శైలిని హేండిల్ చేయలేకపోతున్నది.ఈ అచేతన స్థితిలో ,మాయలో మనం ప్రకృతిని చాలా దెబ్బతీస్తున్నాము.విశ్వ ఉనికికి మానవజాతిని ప్రకృతిసిద్ధమైన మార్గంలో పెట్టడానికి,అహింసా మార్గంలో జీవించేలా చేయడానికి సమయం వచ్చింది.
  • కర్మ యొక్క మూడు స్థాయిల గురించి నేను మీకు ముందే వివరించాను.ఈ మూడు స్థాయిలలోను మీరు ఎంత ఎత్తుకి ఎదగగలిగితే ,కరోనా తరువాత ప్రపంచంలో మీరు అంతా ముఖ్యమైనవారిగా వుంటారు.
  • మీరు త్యాగం తోటి,ప్రపంచానికి మంచి చేస్తూ మీరు పై పైకి ఎదగండి.వ్యక్తిగత ,సెల్ఫ్ సెంట్రిక్ జీవన శైలి ఇక ముందు ఎంత మాత్రమూ పనిచేయదు.
  • వ్యక్తిగతానికి కూడబెట్టినది ఇకముందు నిరుపయోగం.మీ వ్యక్తిగతానికి కూడబెట్టిన డబ్బుకాని,స్థలాలు ఏమైనా స్వంత లాభాలకోసం వుంచినవి ఎందుకు పనికిరానివి అవ్వడమే కాకుండా మీకు భారంగా తాయారు అవుతాయి.
  • దయచేసి ఈ పదాలను మార్క్ చేయండి,కరోనా తరువాత ప్రపంచానికి అప్లై చేయండి.షుమారుగా డిసెంబర్ 14 ,సూర్యగ్రహణం తరువాత.
  • నేను పలికిన ప్రతి పదము విశ్వం,కాస్మిక్ రెవెలాషన్స్ ( COSMIC REVELATIONS ) కి అనుగుణంగా వున్నదని సరిచూస్తున్నాను.
  • నేను మీతో షేర్ చేసింది నోట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను,మీకు మెయిల్ లాగా పంపబడుతుంది.కాబట్టి మీరు దీన్ని అనుసరిస్తూ ,ఈ సత్సంగ్ ని ఆనందించండి.దీనిమీద నేను సంతకం చేస్తున్నాను.లైవ్ సత్సంగ్ లో పాల్గొన్నవారు అందరు దీన్ని అందుకుంటారు.YOU CAN KEEP THIS AS NOTES AND ENJOY .నేను మూడు స్థాయిలు,భగవద్గీత నోట్స్ పెట్టాను !
  • నేను మీకు చెప్పడానికి ప్రయత్నించేది ఏమిటంటే ,మీరు ఒక బాధ్యతగల నాయకుడుగా,ఒక పెద్దగా ఉండటానికి తయారుగా వుండండి, మీకు కరోనా తరువాత ప్రపంచం లో భవిష్యత్తు కావాలనుకుంటే.వ్యక్తిగత యాజమాన్యం,ఆస్తులు అసంబద్ధం అవుతాయి.ఒక బాధ్యతగల నాయకుడు అవ్వడానికి మీకున్న సామర్ధ్యం,మీ చేతన స్థితి,మెంటల్ సెటప్, మిమ్మలను బాధ్యతగల నాయకునిగా నిలబెట్టడానికి ఉపయోగపడతాయి.కరోనా తరువాత ప్రపంచంలో మీ భాద్యర్హగల నాయకుని పాత్రే మీ శక్తి,మీ బలం,మీ ఆస్తులు.
  • కరోనా తరువాత దీర్ఘకాలిక పెట్టుబడిదారీ సేకరణ .....

మీరు విలువైనవి అనుకున్న చాలా విషయాలు విలువలేకుండా పోతాయి.వజ్రాలు హఠాత్తుగా సాధారణ రాయి లాగా దిగజారిపోతాయి.ఎందుకంటె ఎక్కువగా ఉత్పత్తి చేయడం,వాటికీ డిమాండ్ లేకపోవడం.మీరు చాలా చిన్నవిషయాలు అనుకున్నవి జీవితంలో చాలా ఉపయోగకరంగా మారతాయి.

  • వేధింపులకు,బాధలకు,విమర్శలకు కృంగిపోకుండా తట్టుకునే సామర్ధ్యం వున్న మెదడు ,ఆ శక్తి- వజ్రం ,అది మీరు కూడపెట్టిన ఆస్తులకన్నా మిలియన్ రెట్లు గొప్పదని రుజువు అవుతుంది.
  • డిసెంబర్ వరకు నేను రాసిన పుస్తకాలు చదవండి,భగవత్గీత మీద నేను రాసిన వ్యాఖ్యలు చదవండి,నేను చేసిన సత్సంగ్ లు,ఆ సత్సంగ్ లు చాలా శక్తివంతమైనవి.మిమ్మల్ని వజ్రంలా మెరిసేలా చేస్తాయి.
  • చేతన సత్యాలతో మిమ్మలను మీరు గొప్పగా మలుచుకోండి.( BUILD YOUR BEING WITH MORE AND MORE CONSCIOUS TRUTHS )
  • చెన్నై లో ఒక శాస్త్రవేత్త రాసిన వ్యాసాన్ని చదవమని మీకు చెప్పాను, సూర్యగ్రహణానికి కొరోనాకి సంబంధం గురించి చెప్పారు, అది బాగా స్ప్రెడ్ అవుతుంది.నేను మీకు మరొక్కసారి దాన్ని గురించి గుర్తుచేస్తూ,దాన్ని చదవడానికి కొంత సమయం ఇస్తున్నాను.ఎందుకంటె దాన్ని గురించి నేను మీకు కొంచం వివరించాలి.
  • అది ఇలా చెప్తుంది-ఒక ప్రక్రియ వలన కరోనా వ్యాప్తి చెందుతుంది,నేను చెప్తున్నాను.ఆ ప్రక్రియ ,ఆ ప్రక్రియకు కావలసిన ఉత్ప్రేరకం చేతన శక్తి ( CONSCIOUS ENERGY ).ప్రపంచం మొత్తంమీద జీవితాలకి,జీవనోపాధులకి పెద్దమొత్తంలో నష్టం జరుగుతుంది అంటే,దానికి సామాజికంగా,వైద్యపరంగా మాత్రమే శ్రద్ధ తీసుకుంటే చాలదు,ఆధ్యాత్మికంగా,చేతన స్థితికి ( SPIRITUALLY ,CONSCIOUSLY )కూడా శ్రద్ధ తీసుకోవాలి.ఎందుకంటె ప్రపంచం రాజకీయం,సామాజికం,శాస్త్రీయం,తర్కం,హేతుబద్ధం,ఆర్థికపరంగా కూడుకున్నదే కాదు," చేతనస్థితి " అని పిలవబడేది ఒకటుంది.అది ప్రపంచానికి,మానవ జీవితాలకి ప్రధాన పాత్ర పోషిస్తుంది.
  • అందుకే నేను చెప్తున్నాను , దీనికి శాశ్వత పరిష్కారం,నమ్మకమైన పరిష్కారం కావాలంటే,ఈ మొత్తం కరోనాని మనం ఆధ్యాత్మిక విధానం ద్వారా పరిష్కరించుకోవాలి.
  • శాస్త్రవేత్తలని వాళ్ళ పని చేయనివ్వండి,ఆర్ధిక వేత్తలని,రాజకీయ వేత్తలని,వాళ్ళ పని వారు చేయనివ్వండి.కొంతమంది వ్యాక్సిన్ కనుక్కుంటారు,కొంతమంది మెడిసిన్ లని కనుక్కుంటారు,కొంతమంది భౌతిక దూరం పాటిస్తారు,కానీ మీకు శాశ్విత పరిష్కారం కావాలంటే మొత్తమంతా చేతనస్థితిలో ఆధ్యాత్మికంగా అర్ధంచేసుకుని ముందుకు వెళ్ళాలి.
  • నేను మీ అందరికి ముందే చెప్పినట్లు ఇప్పుడు మానవాళి ఎదుర్కుంటున్న దానికి చేతన పరిష్కారం ( CONSCIOUS SOLUTION ) కనుక్కోవడానికి కైలాసదే భాద్యత.అందుకే నేను మీకు చేతన పరిష్కారం ఇవ్వడానికి,ఈ సమస్యని మొత్తాన్ని చేతన స్థితిలో పరిష్కరించడానికి నిరంతరము మీకు అందుబాటులో ఉంటున్నాను.
  • మానవ జీవితాలమీద,జీవనోపాదిమీద కరోనా ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి.
  • చేతనస్థితి ( CONSCIOUSNESS ),ఇది బాహ్య ప్రపంచం యొక్క సూత్రాలతో , ,ఆలోచనలతో,నిజాలతో,గణాంకాలతో,విమర్శలతో,భయంతో,ఆశతో కొట్టబడదు,చెదరదు.చేతనస్థితి ,చాలా శక్తివంతమైన సంపద.దాన్ని కట్టడం మొదలుపెట్టండి.
  • మీరు బయటవాటి ప్రభావంలో పడకుండా అంతర్గత శక్తి పెంచుకుంటూ పోతే ,మీ వ్యక్తిగత విషయంలోగాని,వేరేవారి జీవిత సమస్యల విషయంలోకాని మీరు స్వచ్ఛమైన పరిష్కారాన్ని పొందగలరు.
  • భయం మిమ్మలను మాయలో పడేస్తుంది,అది మీ సమస్య నుంచి మీ శక్తిని,శ్రద్దని,చేతనస్థితిని తీసేస్తుంది.అదే సమస్య అంతా.
  • మనం డొంకతిరుగుడుగా మాట్లాడటం లేదు.మనం ప్రపంచం చుట్టూ కొడుతున్నాము.THAT IS WHY THE AMOUNT OF FEAR WE GENERATED IS NOT GOING TO BE DIRECTLY CONTROLLING COVID’S NEGATIVE IMPACT ON LIFE AND LIVELIHOOD.
  • కరోనా చుట్టూ మనం ఉత్పత్తి చేసిన ఆనందాతిరేకం జీవితాలని కానీ, జీవనోపాధిని కానీ రక్షించడానికి ఏ విధంగానూ సాయపడటంలేదు.ఎందుకంటె మేధస్సు తన పని తాను చేయడంలేదు,చేతనస్థితి ,జీవితాలమీద,జీవనాధారాలమీద కరోనా ప్రభావం ఎలావుందో చూడటంలో తన పని తాను చేయడం లేదు.
  • చేతన స్థితి పరిస్కారాలు ( CONSCOUSNESS BASED SOLUTIONS ) ఎక్కువ ఆనందాన్ని కానీ,ఎక్కువ భయాన్ని కానీ ఇవ్వవు.లాక్ డౌన్ వద్దు అని నేను చెప్పడం లేదు.అవసరమైన దగ్గర అది ఉండాలి.BUT MORE AND MORE CONSCIOUSNESS-SPECIFIC, LOCATION-BASED SOLUTION SHOULD BE THERE INSTEAD OF GENERALIZED UNCONSCIOUS DECISIONS.
  • తీవ్రమైన అచేతన స్థితి పరిష్కారాలవలన ఎక్కువ భయం కలుగుతుంది.దానివలన మానవులు మానసికంగా దెబ్బతింటారు.ఎప్పుడైతే మానవులు మానసికంగా కృంగిపోతారో అప్పుడు వారు చనిపోవడానికి కరోనా ప్రభావం పూర్తిగా అవసరం లేదు.అప్పుడు మానవులు కరోనా కొంచం తగిలినా కృంగిపోతారు.కరోనా వుంది అనగానే వాళ్ళు చనిపోతారు ఎందుకంటె మానసికంగా వాళ్ళు అప్పటికే చనిపోయారు కాబట్టి.
  • " ఈ సత్సంగ్ మూడు నాలుగు సార్లు చూడండి.నేను చెప్పాలనుకున్న ప్రధాన సత్యం మీకు అర్ధమవుతుంది".
  • జీవితాలకి,జీవనోపాధులకి కరోనా మీద భయం పోవాలంటే చేతన స్థితి విధానాలు మరిన్ని కావాలి.(CONSCIOUSNESS -BASED APPROACH ) నిర్ణయం తీసుకునే విధానంలో ఎక్కువ భయానికి కానీ,ఆశకు కానీ అవకాశం ఇవ్వకండి.ముఖ్యమైన విషయం-విశ్వం చేతనస్థితి.(UNIVERSE IS CINSCIOUSNESS ) భూగోళం లో మానవాళి మీద పెద్దఎత్తున ఘర్షణ జరుగుతున్నప్పుడు ,విశ్వం చేతనస్థితిలో పరిష్కరించాల్సిన అవసరం వుంది. ఒక్కవైద్యపరంగా,సామాజికపరంగా,ఆర్ధికంగా,హేతుబద్దంగా కరోనా ని నివారించలేము
  • కరోనా కి చేతనస్థితి పరిష్కారాలు-ఎక్కువమంది ప్రజలు ధ్యానం చేయడం,UNCLUTCHING , నిర్వికల్ప సమాధిలోకి వెళ్లడం,హీలింగ్ చేయడం.
  • సామూహిక చేతనస్థితికి మనం చేసిన తీవ్ర అచేతనస్థితి నష్టం ...మనం ఇదొక్కటి చేస్తే సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది.లేకపోతే కరోనా తర్వాత ఏ బోరోనా నో ,కరోనా 2 వస్తాయి.
  • కాబట్టి దీనికి శాశ్వత పరిష్కారం కావాలనుకుంటే కొన్ని వేలమంది నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళడానికి ఎదగాలి.
  • మీరు ఉపయోగపడాలి అనుకుంటే ,మీరు లీడర్ అవ్వాలి అనుకుంటే ,కరోనా తరువాత సహకారం అందించండి.భాద్యతాపరమైన చేతనస్థితి ని అలవర్చుకోండి.ఇది మీకున్న ధనం,మీకున్న ఆస్తులు,విలువైన లోహాలు,బంగారం వీటన్నింటికన్నా విలువైన ఆస్తి అవుతుంది.మీకున్న ఆస్తి పాస్తులేమీ ముఖ్యం అవ్వవు.ఈ ప్రపంచం లో చేతన స్థితితో,భాద్యతగా వ్యవహరించడానికి మీకున్న సామర్ధ్యం మాత్రమే మీ ఆస్తులు.
  • మీకు ఇది ఉంటే ,డబ్బు వలన మీకు మంచి మద్దతు ఉంటుంది.కానీ చేతన స్థితి లేకుండా డబ్బుతో మిమ్మల్ని మీరు నిర్మించుకోవడం పనికిరానిది అవుతుంది.
  • ఈ చాతుర్మాస్య -జులై 5 వ తారీకునుంచి అక్టోబర్ 25 తారీకువరకు మీ చేతన స్థితిని పెంచుకోవడానికి సమయాన్ని వెచ్చించండి.కరోనా తరువాత ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి ,కరోనా తరువాత ప్రపంచాన్ని నడిపించడానికి చేతన స్థితిని పెంచుకుందాము.HE POST CORONA WORLD IS SUPERCONSCIOUS-CENTERED NEW WORLD ORDER, NEW FUTURE.
  • మాయ ఆధారిత పరిశ్రమలు కరోనా తరువాత అసంబద్ధంగా అవుతాయి.వ్యవసాయానికి , నాచురల్ మెడిసిన్స్,డిజిటల్ అసెట్ బిల్డింగ్ కి ఎక్కువ శక్తిని ఉపయోగించండి.అవి మీకు,ప్రపంచానికి మిగిలినవాటికన్నా విలువైనవి అవుతాయి.
  • ఆర్ధిక వ్యవస్థ భావన మారబోతుంది.
  • నేను కొన్ని నెలల క్రితం ఒక ప్రకటన చేసాను.శక్తులు ప్రదర్శించే ప్రతి ఒక్క నా బాలసంత్ బిలియన్ డాల్లర్లతో సమానం అని.శక్తులని ప్రదర్శించే ప్రతి బాలసంత్ కరోనా తరువాత ప్రపంచంలో నివసిస్తారు.కోటీశ్వరులు కరోనా ముందు ప్రపంచంలో జీవించినట్లు.
  • వృత్తి ఎంపికలు మారబోతున్నాయి,ఎందుకంటె సమాజం యొక్క అవసరం మారబోతుంది. రోగిని నిజంగా సంరక్షించే డాక్టర్లు ,రోగ నిర్ధారణ,చికిత్స,మొదలగునవి చేతనస్థితి ని అర్ధం చేసుకుని చేస్తారు.EVEN DOCTORS WHO REALLY CARE FOR THE PATIENT, ARE GOING TO USE CONSCIOUSNESS BASED UNDERSTANDING IN DIAGNOSING, TREATING, CARING, PATIENTS
  • మన భక్తులలో డాక్టర్ లకి ప్రత్యేక తరగతులు (SESSIONS ) నిర్వహించాలి అనుకుంటున్నాను.బాడీ స్కానింగ్ చేయడానికి,స్పిరిట్యుయల్ హీలింగ్ చేయడానికి,కరోనా రోగులకు ,కొరోనానుంచి కోలుకోవడానికి చేసేలాగా దీక్ష ఇవ్వాలి అనుకుంటున్నాను.
  • లీగల్ కాట్రాక్టర్లు కూడా చెల్లుబాటు కారు.ఎందుకంటె ఇరువైపులా నెరవేర్చలేకపోతున్నారు.వారు వృత్తి పరంగా,సామాజికంగా అన్ని స్థాయిల్లోనూ వెనక్కి వెళ్లిపోతున్నారు.ఇది కరిగిపోతుంది.
  • కర్మ మిమ్మలను ముట్టుకోకుండా వుండే స్పేస్ లో ఎలా ఉండాలో మీరు అర్ధం చేసుకోగలరు.
  • నేను చేతితో రాసిన నోట్స్ ని మీకు పంపిస్తాను.ప్రతిరోజు సత్సంగ్ లో నేను షేర్ చెయ్యాలనుకున్న నోట్స్ ని లైవ్ సత్సంగ్ కి వచ్చినవారికి పంపిస్తాను.మీరు చదువుకోవడానికి మరియు శక్తులను ప్రదర్శించడానికి ఉంచుకోండి.దీనిని ఎంజాయ్ చెయ్యండి.
  • ఈరోజు బాడీ స్కాన్ చేసే శక్తిని ,వస్తువుని కదిపే శక్తిని ప్రదర్శించండి.కోవిద్ వచ్చిన రోగులను స్పిరిట్యుయల్ హీలింగ్ తో తగ్గించేలా మీకు నేర్పిస్తాను.కాబట్టి మీ అందరికి ఈ రెండు శక్తులను ఇవ్వనివ్వండి.
  • I BLESS YOU ALL. BE BLISSFUL

ఫేస్ బుక్ పోస్ట్లు