జులై 17 2020

From Nithyanandapedia
Jump to navigation Jump to search

పేరు

ఈ ప్రలయ సమయంలో వ్యవస్థీకృత సేవలను అందించడం - COVID మహమ్మారి సమయం II పరమశివోహం-S8 II మనస్సును పఠించే శక్తి II ఆలోచనలను పఠించే శక్తి II దేవి భావదర్శనం II సమయాన్ని జయించడం II 1వ ఆడి వెల్లి

కథనం

The Supreme Pontiff of Hinduism, Jagatguru Mahasannidhanam, His Divine Holiness, Bhagavan Nithyananda Paramashivam, expounded on the cosmic principle, Providing Organized Services During This Pralaya - Pandemic Time, during the everyday live public talk - Nithyananda Satsang. His Divine Holiness (HDH) opened the Star Gate Portal of KAILASA, instructing all delegates and the public to sit straight & Unclutch. HDH also inaugurated the KAILASA Global Services , 6 organizations and Initiatives, under 6 different coloured Oms expressing that ‘WE WILL ORGANISE ALL OUR ACTIVITIES AND SERVICES UNDER THESE SIX ORGANISATIONS.’ The day also witnessed 1st Adi Velli. The Darshan for today was Devi Bhava Darshan.

Contributing to over [[108 humanitarian causes of SHRIKAILASA Uniting Nations]], KAILASA's Nithyananda Hindu University marks today as Season 8, Day 8 of Paramashivoham. One of the major highlights of KAILASA’s contributions through this convention is Power Manifestation, today being the Power of Completion, Mind Reading, and Thought Current Scanning.

Sanyasis of the Nithyananda Order of Monks and initiated Acharyas worldwide, affiliated with the Department of Education of KAILASA conducted a series of seminars focusing on Truths of Gender, En-relationships, Conquering Time, Anahata, Living Advaita Process and the Power of Enriching and Sanyas as revealed by HDH inspiring millions towards the Science of Hinduism.

సత్సంగం

Video Audio



సత్సంగం యొక్క తెలుగు అనువాద కధనం

17 జులై,2020 ,08 : 16 pm . నిత్యానంద సత్సంగ్

  • కైలాస నుంచి ప్రత్యక్షంగా పరమశివ సందేశం.
  • ఈ ప్రళయ కాలంలో మానవులందరు కొన్ని విషయాలు తప్పనిసరిగా చేయాలి - మహమ్మారి సమయం.
  • మొదట : ఈ కరోనా వైరస్,కోవిద్ 19 , బారిన పడిన వారు అందరు త్వరగా కోలుకోవాలని వ్యక్తిగతంగా నేను,కైలాస వాసులు అందరూ హృదయపూర్వకంగా పరమశివుని వేడుకుంటున్నాము.
  • ఈ మహమ్మారినుంచి ప్రపంచాన్ని కాపాడాలని,దాని ప్రభావము,పర్యవసానం నుంచి కాపాడాలని పరమశివుని నేను,కైలాస వాసులు అందరూ హృదయపూర్వకంగా ప్రార్ధిస్తున్నాము; ఈ సంక్షోభం నుంచి,వుద్యోగం లేకపోవడం,నిరుద్యోగం,మానసిక భాదలు,మహమ్మారి వలన కలిగిన శ్రమ,ఆర్ధిక సంక్షోభం,ఆకలి,రోగాలు,చావు,బెంగ,ఉద్వేగపూరితమైన గందరగోళం... మేము సర్వశక్తుడైన పరమశివుని ప్రార్ధిస్తున్నాము.ఈ సమస్యలన్నిటినుంచి ప్రపంచాన్ని కాపాడమని.
  • నిర్ణయాలు తీసుకునే వారు,నాయకులూ,సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులను నేను అభ్యర్ధిస్తున్నాను,మన మొదటి ప్రాధాన్యత ప్రజలను ఆకలినుంచి,నిరుపేదరికం నుంచి కాపాడాలి.
  • ప్రజలను ఆకలితో,పేదరికంతో మరణించకుండా చూద్దాము.ఈ ప్రళయంనుంచి మనం తప్పకుండా బయటపడతాము.
  • ప్రజలను ఆకలితో, పేదరికం వలన మరణించేలా చేస్తే , మనలను మనమే క్షమించుకోలేము.కాబట్టి నేను నిర్ణయాలు తీసుకునేవారిని,ప్రపంచనాయకులను,ప్రపంచాన్ని నిజంగా ప్రభావితం చేయగలిగేవారిని అందరిని అభ్యర్ధిస్తున్నాను. ఆకలిని,పేదరికాన్ని తొలగించడానికి మనందరమూ చేతులు కలుపుదాము.
  • ఇప్పటికే అంతర్జాతీయ సంస్థలు ముందుగానే చెపుతున్నారు.ఎక్కువ మంది ఆకలి వలననే చనిపోతారని.ఈ ప్రళయం నుంచి బయటపడినవారు ,ప్రజలను ఆకలి వలన మరణించేలా చేసినందుకు వారిని వారే క్షమించుకోలేరు.ఆకలి చావులు మనలను ఎప్పటికి వేటాడుతూవుంటాయి.ఆకలి మరణాలు లేకుండా చూద్దాము.
  • ఇది మనమే నిర్వహించడానికి నేను నిర్ణయించుకున్నాను.1994 నుంచి మనం కైలాస ద్వారా చాలా సేవలను అందిస్తూ వున్నాము. నాకు యోగ పట్టాభిషేకం జరిగింది. అప్పటినించి అవకాశమున్న ప్రతి దారిలోను మానవాళికి సేవ చేయాలనీ నా గురువులు నాకు ఆదేశాలు ఇచ్చారు.మానవాళికి సేవచేయడం మొదలుపెట్టాను.
  • ఇకనుంచి మన నిర్వహణ కొత్త పేర్లతో ఉంటుంది.ఈ రోజు నేను ఆరు కొత్త సంస్థలను ప్రారంభిస్తున్నాను.ఈ ఆరు సంస్థలనుంచి మన కార్యకలాపాలను నిర్వహించుదాము.

1 ) కాషాయ ఓం ( SAFFRON OM ) - ప్రపంచ శాంతికి, పోరాట స్పష్టత ( Conflict resolution ) , మతపరమైన స్వేచ్ఛ మీద ద్రుష్టి పెడతారు 2 ) ఎరుపు ఓం ( RED OM ) - ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు,తుఫానులు,సునామీలు లాంటివి.మానవులవలన వచ్చే విపత్తులు,యుద్దాలు లాంటివి,వచ్చినప్పుడు సహాయ కార్యక్రమాలు చేస్తారు.ప్రజలలో ఆకలిని ,పేదరికాన్ని తొలగించడం ద్వారా ఈ పనిని మొదలుపెడదాము, ముక్యంగా కొన్ని దేశాలలో కొన్ని లక్షల మంది ఆకలితో మరణిస్తారని గ్లోబల్ ఆర్గనైజషన్స్ ముందుగానే చెప్తున్నాయి.

  • మీ అందరితో పంచుకోవడానికి నా దగ్గర ఒక వ్యాసం వున్నది.
  • ప్రపంచంలో హిందూ ప్రవాసులు రెండు విషయాలలో అందరికి తెలుసు.మనం ధనవంతులం.ఇది అందరికి తెలుసు.ఇది సత్యం.అన్ని అభివృద్ధిచెందిన దేశాలలో మనం ( THE RICHEST ETHNIC MINORITY )ధనవంతులమైన మైనారిటీ జాతి.అన్ని అభివృద్ధి చెందిన దేశాలలో .అమెరికా,యూరప్,ఆఫ్రికా,ఆస్ట్రేలియా దేశాలలో,మనం ధనవంతులం కాదని చెప్పలేము.
  • మనం చాలా దయాశీలులం.దానం చేసేవాళ్ళం .ఇది నేను వ్యక్తిగతంగా చూడటమే కాకుండా ప్రపంచంలో చాలా విశ్వవిద్యాలయాలు మానవ ప్రవర్తన,సామజిక శాస్త్రం మీద చేసిన సర్వ్ లలో హిందువులు ధనవంతులు,గొప్ప దానగుణం కలవారుఅని రుజువైంది.
  • రెడ్- ఓం ( RED - OM ) బ్యానర్ క్రింద ఇప్పుడు హిందువులు ప్రపంచం మొత్తం మీద ఆకలి తీర్చే నిర్వహణ చేపట్టాలి.నేను కైలాసవాసులను హృదయపూర్వకంగా అభ్యర్ధిస్తున్నాను,ఈ మూడు పనులు చేయడం మొదలుపెట్టాలని.

1 ) ఎక్కడ ఆహార అవసరం ఉంటుందో కనుక్కోవడం. 2 ) ప్రభుత్వాల ,దేశంలో నిర్ణయాలు తీసుకునేవారి దగ్గరకు వెళ్లడం,ఎక్కడ ఆకలి ప్రబలంగా వుందో,ఎక్కడ ఆకలి అవసరం తీర్చాలో .

  • ఎక్కడ ఎక్కువ ఆకలితో మరణించుతారో ఆ దేశాల జాబితాను యునైటెడ్ నేషన్స్ తయారుచేసింది,ఇప్పటికే ప్రజలు మద్దతు ఇస్తూ విరాళాలు ఇస్తున్నారు.ఎవరికైతే నిజంగా ఆహరం అవసరమో వారివద్దకు చేరి నిధులు అందచేద్దాము.

3 ) వాస్తవంగా దాతలైన ధనవంతులైన హిందువుల వద్దకు వెళ్లి "రెడ్ ఓం " గురించి వివరించండి.వారి సమయాన్ని,ప్రజ్ఞని,ధనాన్ని పంచమని అడగండి.

  • ఆహరం అందించే విషయం అయితే హిందువులు వారివద్ద ధనం లేకపోయినా వారి సమయాన్ని, ప్రజ్ఞని వినియోగించడానికి సంతోషంగా ఒప్పుకుంటారు.అన్ని దానాలకన్నా అన్నదానం గొప్పదని హిందువులు నమ్ముతారు.ఇది జీవితాన్ని ఇవ్వడంతో సమానం.
  • కాబట్టి కొంతమంది కైలాసవాసులు ఈ సేవ మీద ద్రుష్టి పెట్టాలి.గుర్తించాలి,అందించాలి,మద్దతు ఇవ్వడానికి ఎక్కువమంది హిందువులను ప్రోత్సహించాలి. ఈ మూడు పనులు మనమే నిర్వహించుదాము.మనం ఈ మూడు చేస్తూనే వున్నాము.కానీ ఇప్పుడు "రెడ్ - ఓం" పేరుమీద ,అంతర్జాతీయంగా వ్యవస్థీకృత మార్గంలో ( organised way ) చేద్దాం.

3 ) ఆకుపచ్చ ఓం (గ్రీన్-ఓం)- పర్యావరణ పరిరక్షణకు పనిచేస్తుంది.పర్యావరణ పరిరక్షణ విలువలను ప్రచారం చేద్దాం.' గ్రీన్ని ఓం " సంస్థ ద్వారా పర్యావరణ పరిరక్షణ కార్యకలాపాలను నిర్ణయం తీసుకునే వారి ( decision makers ) వద్దకు,ప్రపంచానికి తీసుకుని వెళ్లదాము . 4 ) నీలం ఓం (బ్లూ ఓం-) జంతు హక్కులకోసం పనిచేస్తారు.మన మానవులు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ,భూగోళం ఒక్క మానవులకు మాత్రమే చెందినది కాదు.ఒక జీవిని నాశనం చేసే హక్కు మనకు లేదు.ఏ ప్రయోజనంకోసమైన సరే జంతువులను చంపే హక్కు మనకు లేదు."బ్లూ ఓం " సంస్థలో జంతు హక్కుల గురించి పనిచేయడం మొదలుపెడతాము.

  • కైలాస,కైలాసవాసులు వివిధ సంస్థల క్రింద పనిచేసేవారు ప్రపంచమంతా వివిధ సేవలను అందిస్తున్నారు.ఇప్పుడు మనం ఈ 5 సంస్థల ద్వారా నిర్వహించుదాము.

5 ) తెలుపు ఓం (వైట్ ఓం)- మానసిక సమస్యలకు,భావోద్వేగాలకు,ఆధ్యాత్మిక సలహాలు అందించడానికి మరియు అత్త్యుత్తమ చేతనస్థితిని పొందడానికి సహాయపడతారు.

  • మనం బహుళ సేవ కార్యక్రమాలు చేస్తున్నాము.ఇప్పుడు ఈ సంస్థలను ఈ బ్యానర్ ల క్రింద ఏర్పాటు చేసి ప్రపంచానికి చేరుకుందాము.వాస్తవంగా ఒక వైవిద్యం తీసుకువద్దాము.

6 ) పసుపు ఓం-( ఎల్లో ఓం )- ప్రపంచానికి అవసరమైన యోగా,ఆయుర్వేద పరిష్కారాలు,వైద్య సంరక్షణ లను అందిస్తారు.హిందూ యోగా శాస్త్ర ఆధారంగా ,హిందూ వైద్య శాస్త్ర ఆధారిత జ్ఞానాన్ని ,వైద్య సహాయం, శిక్షణ,ఇవన్నీ ఈ సంస్థ క్రిందకు వస్తాయి.

  • పసుపు ఎందుకు? గురువు రంగు పసుపు! దేవ గురువు బృహస్పతి రంగు పసుపు. పసుపు ఓం పేరున ఆయనను గౌరవించడానికి.గ్రంధాలయాలను మొదలుపెట్టడం, గ్రంధాలయాల సౌకర్యం మొదలగు జ్ఞాన సంబంధిత సేవలను ప్రపంచానికి ,జ్ఞానము అవసము అనుకున్న ప్రజలకు ఈ పసుపు ఓం ద్వారా అందిస్తాము.ఇది దేవ గురువు బృహస్పతి,అంతిమ ఆది గురువు దక్షిణామూర్తి-పరమశివుని ఆనందింపచేస్తుంది.( THIS WILL CELEBRATE THE DEVA GURU BRIHASPATI AND THE ULTIMATE ADI GURU DAKSHINAMURTHY - PARAMASHIVA HIMSELF. ) జ్ఞానాన్ని అందించే అన్ని కార్యకలాపాలు పసుపు ఓం క్రింద జరగబడతాయి.ఇది మొత్తం సత్ విద్య ను అందిస్తుంది.
  • ఈ ఆరు సంస్థల ద్వారా మనం సేవలను వ్యవస్థీకృత మార్గంలో ( Organised way ) అందచేస్తాము.
  • ఇప్పటివరకు మనం ప్రపంచం మొత్తం మీద కొన్ని వేల సంస్థల ద్వారా సేవలను అందిస్తున్నాము. నేను హిందువులందరిని అభ్యర్దిస్తున్నాను : మనమందరము ఈ బ్యానర్ క్రింద వ్యవస్థీకృతము అవుదాము, సామజిక సేవ చేయడానికి ఎక్కువమంది ప్రజలవద్దకు వెళదాము.తీవ్రమైన,వాస్తవమైన,బాధ్యతగల,స్వచ్చంద కార్యకలాపాలు మరియు సహాయక పనులు సులభంగా పరిష్కరింపబడతాయి.
  • కైలాసవాసులందరినీ అభ్యర్దిస్తున్నాను.ఇప్పుడు పరిచయం చేసిన పేర్లతో ఈ సందేశాన్ని ప్రపంచానికి తీసుకువెళ్ళండి.ఈ రోజే ఈ 6 పేర్లను కైలాసవాసులు అందరికి,ప్రపంచంలోని హిందువులందరికి పరిచయం చేయడానికి సమయం తీసుకోండి.
  • రిజిస్టర్ చేసుకోవడానికి KAILASA .ORG / GLOBALSERVICES కి వెళ్ళండి.
  • పరమశివ గణ లో పాల్గొన్నవారు దీన్ని తీసుకోండి.ఇది మనం చేస్తున్న పని లాంటిదే.మనం కొంచం వ్యవస్థీకృతం అవ్వాలి .మరియు హిదూత్వాన్ని అనుసరించే వారిని ఇందులో భాగం అవ్వమని ప్రేరేపించాలి,మరియు ఈ సేవలతో ప్రపంచం మొత్తాన్ని చేరుకోవాలి.
  • ఇప్పుడు జరుగుతున్న ప్రళయం చాలా ఉదృతమవుతుంది.దురదృష్టవశాత్తు మనం ప్రపంచాన్ని కాపాడటానికి ఇంటినుంచి బయటకు రాలేక పోతున్నాము.జనం చనిపోతున్నారు అని తెలిసినా,వారి అవసరం తీర్చడానికి మనం ఏమి చేయలేకపోతున్నాము.మనం బ్రతికి ఉండాలి అంటే ఇంట్లోనే ఉండాలి.
  • పేద దేశాలకు ఎక్కువ సహాయం చేయడానికి యూ యెన్ పిలుస్తోంది. 10 .3 బిలియన్ల అవసరం అక్కడ వుంది.ఎందుకంటె ఆకలి చంపబోతోంది.
  • నేను ఒక కార్టూన్ చూసాను,నిజంగా బాధపెట్టేలా వుంది.కోవిద్ 19 నుంచి తమని రక్షించుకోవడానికి చాలా మంది మాస్క్ లు పెట్టుకుంటున్నారు.కానీ చాలా దేశాలలో తినడానికి ఆహరం లేక మాస్క్ లు పెట్టుకుంటున్నారు.ఆకలితో ప్రజలు చనిపోతున్నారు అంటే మనలను మనం క్షమించుకోలేము అని నేను అనుకుంటున్నాను.
  • కైలాస ఆధ్యాత్మిక పరిష్కారాలు కనుక్కోవడమే కాకుండా స్వచ్చంద కార్యక్రమాలుకూడా చేయాలి.
  • నేను కైలాసవాసులను అభ్యర్దిస్తున్నాను : అందరమూ చురుకుగా తయారవుదాము.మీరు ధనాన్ని పంచలేకపోయినప్పటికీ,ఎందుకంటె అది మీకు ఉండొచ్చు,లేకపోవచ్చు.దయచేసి మీ సమయాన్ని,మీ ప్రతిభను పంచండి.ఎరుపు ఓం సంస్థ ద్వారా మనం ధనవంతులకు,పేదవారికి మధ్య ఒక స్వచ్చంద వంతెనను నిర్మిద్దాము.ఇది చాలా సులువు. కైలాసవాసులు దీనికి భాద్యత వహిస్తారు.
  • నా దగ్గర ఇంకొక్క వ్యాసం వుంది.
  • ఈ 2020 సంవత్సర ఆఖరకు 26 .5 కోట్ల జనాభా పస్తులతో అలమటిస్తారని యూ యెన్ హెచ్చరిస్తుంది.నేను అనుకున్నట్లు ఇది డిసెంబర్ 14 . ( WITH THE FIRST INCREASE GLOBAL POVERTY SINCE 1990, UNLESS URGENT ACTION IS TAKEN )
  • ఇప్పటికే సగం దేశాలు మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. భాద్యత తీసుకుని వీలయినంత చేయడానికి కైలాసవాసులకు ఇది సమయం.
  • తరువాత నా శిష్యులకు,భక్తులకు ,కైలవాసులు అందరికి ఒక గొప్ప విషయం చెప్పాలనుకుంటున్నాను.ఈ ప్రళయ కాలంలో గొప్ప విషయం జరగబోతోందని.కైలాస మహాద్వారం తెరుచుకుంది.సింపుల్ ఆన్ క్లచ్ తో మీరు కైలాసకి వెళ్ళగలరు,మరియు కైలాస అనుభవాన్ని పొందగలరు ( A SIMPLE UNCLUTCHING CAN TRANSPORT / TELEPORT YOU TO KAILASA AND GIVE YOU THE EXPERIENCE OF KAILASA. )
  • ఆన్ క్లచ్చింగ్, కంప్లీషన్, అద్వైతం ( ONE NESS ) , మహావాక్య జపించడం,డీప్ ఫీలింగ్ కనెక్షన్,ఇవన్నీ కైలాసకి మహాద్వారాలు.మీరు ఆన్ క్లచ్ తో వున్నప్పుడు ,మీలోవున్న " ఆనంద గంధ "అనే ద్వారం తెరుచుకుంటుంది.మీరు కైలాసకి వెళ్ళగలరు.
  • నిన్న నేను పరమశివ గణ లో పాల్గొన్నవారికి చెప్తున్నాను ,మీరు ఆన్ క్లచ్ అయ్యి కూర్చుంటే,మీరు మీరుగా ,మీరు పరమశివ.
  • మీకు రెండు అంశాలు ఉంటాయి-మీరు,మీది,మీ మనస్సు,మీ భావోద్వేగాలు,మీ ఆలోచనలు,మీ సంపద,మీ బాంధవ్యాలు.... ఇవన్నీ మీవి. ఒకవేళ మీరు,స్వచ్ఛమైన చేతనస్థితి వీటన్నిటినుంచి ఆన్ క్లచ్ అవుతుందో ,భ్రమలు,మాయలు, మీరు స్వచ్చంగా మీలాగా కూర్చుంటే ,మీరు పరమశివ!
  • నేను హృదయపూర్వకంగా కైలాసవాసులందరిని అభ్యర్దిస్తున్నాను,దీవిస్తున్నాను, స్వచ్ఛమైన ఆన్ క్లచ్చింగ్ ,కైలాస మహాద్వారం,అనుభవం పొందండి.మరియు పరమశివ అనుభవం పొందండి.
  • ఇప్పుడు తీవ్రంగా, హృదయపూర్వకంగా ( NOW INTENSELY AND SINCERELY,) నిటారుగా కూర్చుని,మీగురించి మీరు ఏమనుకుంటున్నారో వాటినుంచి ఆన్ క్లచ్ అవ్వండి,చేతనస్థితి అంత స్వచ్చంగా,కైలాస మహా ద్వారం తెరుచుకోగలదు,మీకు కైలాస,పరమశివ అనుభవం పొందగలరు.

ఫేస్-బుక్ పేజీ లింకులు