Difference between revisions of "సెప్టెంబర్ 1 2020"
m |
|||
Line 1: | Line 1: | ||
==పేరు== | ==పేరు== | ||
− | + | మీ జీవశాస్త్రం యొక్క రసాయనత్వాన్ని అర్థం చేసుకొండి || పరమశివోహం S11 || 36 తత్వాలు మరియు తపస్సు || అనాహత చక్రం | |
==కథనం== | ==కథనం== |
Revision as of 13:14, 7 December 2020
పేరు
మీ జీవశాస్త్రం యొక్క రసాయనత్వాన్ని అర్థం చేసుకొండి || పరమశివోహం S11 || 36 తత్వాలు మరియు తపస్సు || అనాహత చక్రం
కథనం
The Supreme Pontiff of Hinduism, Jagatguru Mahasannidhanam, His Divine Holiness expounded on the cosmic principle, ‘How To Mature Your Soul: Intense Penance (Tapas)’ during the Nithyananda Satsangh. The Darshan for today was Devi Bhava Darshan.
Contributing to over 108 humanitarian causes of Shrikailasa Uniting Nations, KAILASA's Nithyananda Hindu University marks today as Season 11, Day 6 of Paramashivoham with over 1200 delegates across 20 countries participating in the convention. One of the major highlights of KAILASA’s contributions through this convention is Power Manifestation, today being the Power of Mind Reading.
Sanyasis of the Nithyananda Order of Monks and initiated Acharyas worldwide, affiliated with the Department of Education of KAILASA conducted a series of seminars focusing on the attributes of Enrelationships, Gender, Focus on Anahata, Conquering Time, Power of Enriching and Sanyas and Living Advaita process as revealed by the Supreme Pontiff of Hinduism, inspiring millions towards the Science of Hinduism.
వీడియో లింకు
ఆడియో: తీవ్రమైన తపస్సు ద్వారా, మీ ఆత్మ పరిణతి చెందుతుంది
సత్సంగం యొక్క తెలుగు అనువాద కధనం
1 సెప్టెంబర్,2020 ,8 :33 pm ,మంగళవారం,నిత్యానంద సత్సంగ్
- కైలాస నుంచి పరమశివుని సందేశం ప్రత్యక్షంగా.
- నా స్వంత ఆవిర్భావ మైన ఈ 36 సూత్రాలు మీకు శక్తివంతమైన ఆన్క్లచ్ స్పేస్ ని ఇస్తాయి, మీ మనస్సు ఈ 36 తత్వాల మీద తిరుగుతున్నప్పటికీ.
- మీ మనస్సు ఈ 36 తత్వాలను మించి వెళ్ళలేదు.మీ ఇంద్రియ ఆనందాలతో సహా మీ మనస్సుకు తెలిసినదంతా ఈ 36 తత్వాలలో ఉంటుంది.
- మీరు ఆహారానికికానీ,శృంగారానికి కానీ ,పోర్నోగ్రఫీ కానీ దేనికైనా బాసిసైతే ...మీ మనస్సు ఈ 36 తత్వాలు దాటి వెళ్ళదు
- మీరు శివ పూజకి కానీ,మహావాక్య జపానికి,యోగ..లాంటి మంచి వాటికీ బానిసయినా ,అప్పుడు కూడా మీరు ఈ 36 తత్వాలు దాటి వెళ్ళలేరు.
- మీరు చెడు అలవాట్లకు బానిస అవ్వవచ్చు,చెడు మారక ద్రవ్యాలకు బానిస. కొంత మంది విపరీతంగా మారక ద్రవ్యాలకు బానిస అవుతారు,వాటిని ఎక్కువగా తీసుకుని ఆత్మహత చేసుకుంటారు.అప్పుడు కూడా మీ మనస్సు ఈ 36 తత్వాలు దాటి వెళ్ళదు.తెలిసిన ప్రతిఒక్కటి ఈ 36 తత్వాలు.
- ఈ విషయం తెలిస్తే మొదట మీరు అన్ని చెడు వ్యసనాలనుంచి విముక్తి పొందుతారు.మీకు చేతన స్థితి లో ఎలా ఉండాలో తెలుస్తుంది; అత్యుత్తమ చేతనస్థితి పురోగతిని మీకు మీరు ఇచ్చుకోండి.
- మీరు చెడు మార్గాలలో వెళ్లి వేస్ట్ చేసే టైం కానీ,ఉద్దేశం కానీ మీకు ఉండదు.
- ఒక బిలియనీర్ బొమ్మ కారుతో ఆడుకుంటూ టైం వేస్ట్ చేసుకోరు,మానసిక సమస్యలు ఉంటే తప్ప.
- ఎప్పుడైనా ఒకసారి తన పిల్లలకోసం ఆడుకోవచ్చు.అది వేరే.కానీ బొమ్మ కారుని తన హోదా,సంతోషం అనుకోడు.ఎందుకంటె అతని అభిరుచి వేరే.
- మానవ శరీరం కలిగివున్నందుకు మీ అభిరుచులు విశ్వంలో అత్యుత్తమ వైపు ఉండాలి.మీరు ఎంతో నిజాయితీగా కస్టపడి ఏర్పరచుకున్న మీ శరీరాన్ని,మనస్సుని ఈ మరకద్రవ్యాలు,క్రింది స్థాయి చెత్త వ్యసనాలతో పాడుచెసుకోరు.
- మీరు ఎన్నో జన్మల ద్వారా ఎంతో కస్టపడి ఏర్పరచుకున్న మీ శరీరాన్ని,మనసుని పోర్న్,డ్రగ్స్ నాశనం చేస్తున్నాయి.
- ఒక్కసారి మీ ఉనికి యొక్క చేతనస్థితి పొందితే ,మరియు ఈ 36 తత్వాలు పరమశివుని వ్యక్తీకరణాలు అని ,అప్పుడు మీకు తెలుస్తుంది,మీరు ద్రుష్టి పెట్టే 36 తత్వాలు ఏమిటి అని,మరియు మీరు ఇంక ఎప్పుడు వ్యసనాలను మీ జీవితంలో భాగం కానివ్వరు.
- జీవితంలో వ్యసనాలను భాగంగా చేయడం,ఫ్రోజెన్ లైఫ్,దానినే నేను నరకం అంటాను.
- ఒక్కసారి మీరు ఈ 36 తత్వాలను పరమశివా అని తెలుసుకుంటే మీరు సులువుగా ఆన్క్లచ్ చేయకలుగుతారు.
- నేను కొన్ని శక్తివంతమైన పరిజ్ఞానాన్ని,పరిష్కారాలను ఇస్తున్నాను,ఈ శక్తివంతమైన పరిష్కారాలను మీరు అర్ధం చేసుకున్నప్పుడు మీరు ఆటోమాటిక్ గా అక్కడికి చేరుకుంటారు.
- యోగ అంటే పరమశివునితో కలవడం,ఐకమత్యము,ఏకత్వం తో ఉండటం.విశ్వం యొక్క వివిధ అంశాలను,కోణాలను తెలుసుకోవడమే పరమశివుని వ్యక్తీకరించడం.
- ఈ మొత్తం విశ్వమంతా పరమశివుని సృష్టి అని మీరు అర్ధం చేసుకున్నప్పుడు,మీరు పొందే పరిపక్వము- యాంత్రికంగా పోర్న్,డ్రగ్స్,మాంసాహారం,మీ జీవితంలో అవసరం లేకుండా పోతాయి.
- ప్రజలు పోర్నోగ్రఫీ కి ఎలా వ్యసనపరులు అవుతారో అలాగే విసుగు,బెంగ ( DEPRESSION ),కోపం,హింస కి బానిసలు అవుతారు.విసుగు,నిరాశ లేకుండా యదార్ధాన్ని ఎలా డీల్ చేయాలో వారికీ తెలియదు.
- నా గురువు అరుణగిరి యోగీశ్వర చెప్తూ ఉండేవారు.మన పిల్లలందరికీ పురాణం కధలు చెప్తూ ఉండాలి.`ఎందుకు స్వామిజి `? అని నేను అడిగాను.అయన ఇలా చెప్పారు, పిల్లలు వికసించడం ,ప్రపంచంతో సంబంధం మొదలొవుతుంది,అటువంటి సమయంలో వాళ్ళు ఈ గొప్ప పురాణం కధలు వింటే,వారు చక్కగా వికసించడం మొదలుపెడతారు,మరియు యదార్ధం యొక్క వివిధ పొరలతో సంబంధం అవుతారు.
- అందుకే నేను మరీ మరీ చెపుతాను,స్కంద మాత ఎప్పుడు శక్తి క్షేత్రం ( ENERGY FIELD ) లో ఉండాలని.వాతావరణం చాల ముఖ్యం.పర్యావరణం చాలా ముఖ్యం.
- ఒక పిల్లవాడు ఎప్పుడూ చేతనస్థితి యొక్క వివిధ స్థితుల లో వెళుతూఉంటారు.3 సంవత్సరాల వయసు వరకు ,తురీయా,తురీయాతీత లతో సహా చేతనస్థితి యొక్క 25 స్థితులలోకి వెళ్లగలడు.వయసు 7 వరకు పిల్లవాడు 5 స్థితులకు వెళ్లగలడు, సుషుప్తి ( SLEEP ) ,స్వప్న ( DREAM ), జాగ్రత్ ( WAKING ) , తురీయా ( AWAKENED ),తురీయాతీత ( ALIVE ).
- కాబట్టి పురాణాల కధలు,శక్తులను ప్రదర్శించడం మరియు మంచి పర్యావరణం ద్వారా మనం పిల్లలకు మద్దతునిస్తే ,పిల్లవాడు ఎప్పుడూ ఈ 25 స్థితులలోకి ,లేదా కనీసం 5 స్థితులకు వెళ్ళడానికి అవకాశాన్ని పోగొట్టుకోడు.
- పురాణాల కధలు పిల్లవానికి చక్కని చేతనస్థితి సేతువుని నిర్మించుకోవడానికి చాల సహాయపడతాయి.
- నేను ఏ మార్గంలో ప్రపంచంతో సంబంధం కలిగి ఉన్నానో,మామూలు మనిషియొక్క వాస్తవంతో ఎలా ఒప్పందం చేసుకున్నానో,అది పురాణం - కేంద్రీకృతం ( PURANA - CENTRED )
- స్మార్త కి నిర్వచనం స్మృతి ఆధారిత మానసిక వ్యవస్థ .నేను ప్రాధమికంగా ఒక స్మార్త .ప్రపంచంతో ,విశ్వంతో నాకున్న సంబంధాలు ఎలా అంటే-పరమశివ ఎలా స్పందిస్తారో,గణపతి ఎలా ప్రతిస్పందిస్తారో, సుబ్రహ్మణ్యం ఎలా ప్రతిస్పందిస్తారో,దేవి ఎలా ప్రతిస్పందిస్తుందో,నా ఇన్నర్ స్పేస్ లో ఇవే జరుగుతూ ఉంటాయి.
- పురాణం-కేంద్రీకృతంగా జీవితం గురించి అర్ధం చేసుకుంటే ,36 తత్వాలు పరమశివుని వ్యక్తీకృతం అన్న సంబంధాన్ని ఇస్తుంది.మీరు ఎప్పుడూ చీప్ వ్యసనాలకు బానిస అవ్వరు!
- మీకు వ్యసనాలు వున్నా,ఉన్నతమైన వ్యసనాలు ఉంటాయి.మీరు శక్తులతో ఆడుకుంటూ ఉండవచ్చు.మీరు మీ ఉన్నత అవకాశాలతో ఆడుకుంటూ ఉండవచ్చు,మీ అత్యున్నత చేతన స్థితి....అంటే హనుమంతుడు ఎలా సూర్యుణ్ణి పట్టుకుని తిందామనుకున్నాడో!
- స్కందమాత అలాటివి చేయడంలో సామర్ధ్యం కలది,శక్తివంతమైనది.అందుకే ఆమె పర్యావరణంలో పెరగాలి అనుకుంటున్నాను.తను బయట ఉంటే ఇలాంటివి చేస్తుందో లేదో నాకు తెలియదు.ఆమె పెరుగుతున్నప్పుడు ప్రకృతితో ఏమి గందరగోళం జరగకుండా ఉండాలని నేను అనుకుంటున్నాను.అందుకే తను పర్యావరణంలో ఉండాలని అనుకుంటున్నాను.
- మీరు ఉల్లాసభరితంగా వున్నది కూడా గొప్పదానిమీద ఉంటుంది.
- ఈ 36 మీ చేతనస్థితిని పరిపక్వము చేస్తాయి.నేను గత కొన్ని సత్సంగ్ లనుంచి వివరిస్తున్న ఈ 36 తత్వాలు మీ చేతనస్థితిని పరిపక్వము చేస్తాయని తెలుసు.
- చేతనస్థితి యొక్క సూత్రాన్ని మీరు ఎంత ఎక్కువ అర్ధం చేసుకుంటే మీరు అంత ఎక్కువ చేతనస్థితి అనుభూతి పొందగలరు.
- పిల్లలగురించి నిజంగా శ్రద్ధ తీసుకునే తల్లితండ్రులు పిల్లలకు ఏది సరైనదో,ఏది ఆరోగ్యవంతమైనదో నేర్పిస్తారు.
- ఒకరోజు మా శివరూప నాకు మెసేజ్ చేసింది.తన కూతురు నిరాహార సంయమ మొదలుపెట్టాలనుకుంటుంది అని.` తను ఇంకా మైనర్,తను ఇప్పుడు చెయ్య లేదు.తను మేజర్ అయ్యాక చెయ్యమన వచ్చు`, అని చెప్పాను.కానీ నా హృదయంలో ఆ మెసేజ్ చాలా ఆనందాన్ని ఇచ్చింది.నాకు తెలుసు నా పిల్లలు ఉపవాసాలు అలవాటుపడుతున్నారు! ఆమెను నిరాహారకి అనుమతించాల్సింది అని నన్ను అడుగుతున్నారు.
- పిల్లలు కూడా నిరాహార చేయవచ్చు. చక్కని వ్యవస్థని నిర్మించుకోవడానికి ఇది చక్కనిది.ఈ చట్టపరమైన గందరగోళం నాకు ఇష్టం లేదు.కాబట్టి స్థానిక దేశ న్యాయవ్యవస్థని అనుసరించమని నేను చెప్తున్నాను.
- పిల్లలు మంచి విషయాలకు అలవాటు పడితే వాళ్లకు మంచి అద్భుతమైన జీవితం ఉంటుంది.
- ఒక నిజమైన తండ్రి పిల్లలను పెంచాలి ; ఒక నిజమైన తల్లి పిల్లలను పెంచాలి; మంచి విషయాలకు పరిపక్వమైన అభిప్రాయాలను అభివృద్ధి చేస్తూ.
- నా గురువులు చెప్తూ వుండే వారు.సూర్యాస్తమయం తరువాత నీకు ఆకలి అనిపిస్తే అది అబద్దపు ఆకలి.తడి బట్టని కడుపు కి కట్టుకో,ఏమి తినవద్దు అని .వారు నాకు మంచి విషయాలను అలవాటు చేసారు.నాకు పరిపక్వత కలిగించారు.
- మీకు ఈ 36 తత్వాలు తెలిసి,పరమశివుని వ్యక్తీకరించడం తెలిసిఉంటే ,జీవితం కొరకు మీకున్న అభిరుచి పరిపక్వము పొందినట్లే.
- నేను 4 నిరాహార సంయమ లు ఇచ్చాను: శ్రీరామ నిరాహార సంయమ,శ్రీకృష్ణ నిరాహార సంయమ,శ్రీ వ్యాస నిరాహార సంయమ,నిత్యానంద నిరాహార సంయమ.ఈ రోజు నుంచి మీరు వీటిలో ఏదోఒకటి తీసుకుని సాధన చేయడం మొదలుపెట్ట వచ్చు.
- నా కూతురు నిరాహార సంయమ సాధన చేస్తుందని విన్నప్పుడు నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను! నా కూతుళ్లను చూడండి!నేను నా కూతుళ్ళని ఎలా పెంచుతున్నానో ! వాళ్ళు ఆరోగ్యకరమైన ,మంచి వాటికీ అలవాటుపడుతున్నారు.పిల్లలు మంచివాటికి ,ఆరోగ్యకరమైన వాటికీ అలవాటుపడితే ,అది చూసిన తండ్రికి కలిగే ఆనందం!
- అలాగే కొంతమంది గురుకులం పిల్లలు ,గురుకులం వదిలేసి ,సమాజంలోకి తిరిగి వెళ్లి,డ్రగ్స్ కి,ఆల్కహాల్ కి,పోర్న్ కి అలవాటు పడటం మొదలుపెడితే నేను చాలా బాధగా ఫీల్ అవుతాను.
- నా పరమశివ స్థితిలో నాకు ఏ బాధ ఉండదు.కానీ వ్యక్త స్థితిలో ` ఓ భగవంతుడా ,ఆ పిల్లవాడి జీవితం పోయిందే ` అని ఫీల్ అవుతాను.
- ఎవరైనా నా భక్తులు కానీ,గురుకులం వదిలేసి వెళ్లిన పిల్లలు కానీ ఏదైనా ప్రమాదంలో మరణించారని వింటే ,వారికీ ముక్తి కలిగిస్తాను.అది చాలా సులభం.కానీ వాళ్ళు ఏవైనా వ్యసనాలకు అలవాటు పడ్డారని వింటే,ఓ భగవంతుడా,అది ఒక జన్మది కాదు,వారి నిరంతర జన్మలకు వాళ్ళు ఇనుప గొలుసులతో వారిని కట్టేసుకుంటున్నారు.
- జీవితం ప్రతికూల పాటర్న్ లతో మీ శరీరాన్ని,మనస్సుని నాశనం చేసుకోవడం ఒక జన్మ కి నాశనం చేసుకోవడం కాదు.అది బలమైన పాటర్న్ గా మారుతుంది,దాన్ని మీరు జన్మ,జన్మలకి తీసుకువెళతారు.
- నా పిల్లలు,ముక్యంగా 18 తరువాత,ఎప్పుడైనా నాకు మెసేజ్ చేసి,`స్వామిజి నేను నిరాహార చెయ్యాలి అనుకుంటున్నాను,నేను చేయవచ్చా?`అని. `ఎంత మంచి అలవాటు `అని నేను ఫీల్ అవుతాను,ఆ నిరాహార తోపాటు వాళ్ళు కొన్ని వేల మంచి విషయాలు నేర్చుకుంటారని నాకు తెలుసు.
- మీ శరీరాన్ని ఎక్కువ ఆహారంతో నింపినప్పుడు ,మీ మానసిక స్థితి ( mood swings ) ఎలావుంటుందో మీకు తెలుస్తుంది.మీ అలసట స్తంభించి బెంగగా మారినప్పుడు,మీరు ఎప్పుడూ హుషారుగా వుంటారో,బద్దకంగా,అలసటగా,ఉద్రేకంగా,బెంగగా వుంటారో మీకు తెలుస్తుంది.
- ఐస్ అంటే చల్లని నీరు గడ్డకట్టడమే.మీలో చల్లని నీరు మీ బద్ధకం.మీలో చల్లని నీరు గడ్డకట్టినప్పుడు,అది బెంగ ( DEPRESSION ).
- ఒక నిరాహారీకి ,ఒక నెల లోపు ,వాళ్లకు ఏ నిర్దిష్ట సమయంలో ఎలా ఉంటుందో,బెంగ,అలసట,విసుగు,కామం,ఆకలి,నిరాశ,తెలుస్తుంది.వాళ్లకు అన్నీ తెలుస్తాయి.
- నిరాహార తో మీ లోపల ఏమి జరుగుతుందో మీకు పూర్తి అవగాహనా ఉంటుంది.
- ఇది మీకు అర్ధం అయితే , ఈ చెత్త మనసు అలాంటి ప్రధాన నిర్ణయాలు తీసుకునేలా ఎలా చేస్తుందో మీకు అర్ధం అవుతుంది.మిమ్మలను మీ లో మూడ్ లో ( LOW MOOD ) బందీని చేస్తుంది.మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అంటే మీ జీవితం మొత్తం నాశనమైపోతుంది.
- మీరు ప్రధాన నిర్ణయాలు అన్నీ తీవ్రమైన హై మూడ్ లో తీసుకోవాలి,శక్తివంతగా,ఆశాజనకంగా కొనసాగించాలి. ఇదే జీవిత విస్తరణ.( EXPANSION OF LIFE ).
- నిరంతరంగా హై మూడ్ లో వున్నప్పుడు శక్తివంతమైన నిర్ణయాలు చేయడం,దానిని కొనసాగించడం,దానినే నేను పరిపక్వత అంటాను.
- మీ బయాలజీ గురించిన కెమిస్ట్రీ మొత్తం మీకు తెలిస్తే , మీ జీవితం లో ముఖ్యమైన విషయాలు ఎలా నిర్ణయించాలో మీకు తెలుస్తుంది,పెద్ద నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవాలి,ఎప్పుడు తీసుకోకూడదు .
- నా గురువు రఘుపతి యోగి తమిళంలో చెప్పేవారు,`నువ్వు త్రికరణశుద్ధిగా తపస్సులో కూర్చుంటే,శివుడే వచ్చి దయకలిగిస్తాడు,దీవిస్తాడు`, అయన వచ్చినప్పుడు ,`నన్ను క్షమించు `అని ఆయనకి లొంగిపో .
- నా జీవితంలో ముఖ్యమైన జీవన్ముతి అనుభవాలు, శక్తుల ప్రదర్శనలు,ఎప్పుడు వచ్చాయంటే,వాటిని నేను వ్యక్తీకరణ చేసేవరకు ఆహరం లేదు,నిద్ర లేదు అని నేను నిర్ణయించుకున్నప్పుడు కలిగాయి.నేను ఆ పట్టుదలతో కూర్చుని,ఆ కెమిస్ట్రీ మరియు బయాలజీ తో-పరమశివ వ్యక్తమయ్యారు.
- సూర్యుడు ని అద్దంతో ప్రతిబింబిస్తే,సరిచేయగా,సరిచేయగా,ఒక పాయింట్ దగ్గర ప్రతిబింబం వస్తుంది.పిల్లలు ఇలా ఆడుకుంటూ వుంటారు.కాంతి పుంజాన్ని గదిలోపలకు పంపుతూ.
- నేను ఆలా కూర్చున్నాను : ఆహారం లేదు,నిద్ర లేదు- జస్ట్ ధ్యానం,ధ్యానం. ఆటోమాటిక్ గా కెమిస్ట్రీ మరియు బయాలజీ సమలేఖనం ( ALIGNED ) అయ్యాయి.
- మీ శరీరాన్ని ఒక అద్దంలా ఊహించుకోండి,స్వచ్ఛమైన కాంతి కిరణం శక్తుల ప్రదర్శన,పట్టుదల సరిచేసే పద్ధతి,అద్దాన్ని సరిగా సరిచేయాలి.
- అది నేను పెట్టిన ఆహారాన్ని గణేష్ తినడం కావచ్చు,లేదా పవల్ల కుండ్రు లో జీవన్ముక్తి అనుభవం కావచ్చు,లేదా మణికర్ణికా ఘాట్ లో మరణ అనుభవం కావచ్చు,లేదా హరిద్వార్ లో పరమశివ ఆయనే వచ్చి నాకు ఆహారము,మందులు ఇవ్వడం కావచ్చు,లేదా గుజరాత్ లో శ్రీ కృష్ణుని చూడటం కావచ్చు,నా జీవితంలో అన్ని ముఖ్య అనుభవాలు - నేను పట్టుదలతో కూర్చున్నప్పుడు,ఆహరం లేదు,నీరు లేదు, నిద్ర లేదు .1 ,2 ,3 లు లేవు నేను వ్యక్తీకరించే దాక.అది వ్యక్తీకృతమైనది ( IT MANIFESTED )!
- మణికర్ణికా ఘాట్ లో నేను నిర్ణయించుకున్నాను .నాకు అనుభవం అయ్యి శక్తులు రావాలి లేదా చనిపోవడం.ఏమిజరిగిందో చూసారా!నాకు చేతనస్థితిలోనే మరణ అనుభవం,వివిధ శక్తులు నాలో వ్యక్తమవ్వడం మొదలుపెట్టాయి.
- 36 తత్వాలని అర్థంచేసుకోవడం మిమ్మలను చేతనస్థితిలో పరిపక్వము పొందేలా చేస్తుంది,మరియు మంచి విషయాలకు అలవాటుపడేలా చేస్తుంది.మీరు ఎక్కువగా సమాధిలో ఉండటానికి అలవాటు పడతారు.బాహ్య మారకద్రవ్యాలు మీకు సమాధి యొక్క శక్తిని ఇవ్వలేవు.
- మీలోని ఏ స్థితిని అయినా ప్రేరేపించడానికి ఎటువంటి డ్రగ్ లను అనుమతించకండి.ఖచ్చితంగా డ్రగ్స్ వద్దు.ఆధ్యాత్మిక స్థితులు అన్నీ ధ్యానం,సమాధి మీద ఆధారపడి ఉంటాయి.
- ఎప్పుడైతే సమాధి మీలో పారవశ్యం కలిగిస్తుందో ,అప్పుడు మీరు శక్తులను ప్రదర్శిస్తారు.ఎప్పుడైతే డ్రగ్స్ మీలో పారవశ్యాన్ని కలిగిస్తాయో అప్పుడు మీరు శక్తిహీనత ప్రదర్శిస్తారు,మీరు వ్యసనపరులు అవుతారు.
- మీరు సరైన అలవాట్లు కలిగి ఉండాలి.దాని అర్ధం యోగ,సమాధి,ధ్యానం,నిరాహార సంయమ. స్వచ్ఛమైన ఆధ్యాత్మిక విషయాలకు మాత్రమే మీరు వ్యసనపరులై ఉండాలి.
- ఎప్పుడు చెడు వ్యసనాలను అనుమతించకండి.ఎందుకంటే మీరు చాలా ఎక్కువ జన్మలకు వ్యసనపరులై వుంటారు.అది అంత వినాశనకారి.
- 18 నిండిన చాలామంది పిల్లలు నాకు మెసేజ్ పంపిస్తున్నారు.` నేను నిరాహార చేస్తున్నాను `అని.18 నిండిన, నాకు మెసేజ్ చేసి ,నిరాహారకి అనుమతి కోరిన పిల్లలందరికీ నేను చెప్పే పదం ` నేను మిమ్మలను ప్రేమిస్తున్నాను,మీరు మంచి మార్గంలో వున్నారు `!
- నా దగ్గర శుభవార్త వుంది: మీకు పెద్ద శరీరం ఉంటే,ఏకైక శక్తి మరియు ఎనర్జీ ,అది మీ శరీరం తనని తానే తిన్నప్పుడు అది మీలో మానిఫెస్ట్ అవుతుంది.కాబట్టి మీకు పెద్ద కొవ్వు శరీరం ఉంటే నిరాహార మొదలుపెట్టండి. మీ శరీరం తనని తానే తినడం మొదలుపెడుతుంది.అది మీలో చాలా శక్తిని తెస్తుంది.మీ జీవితంలో చాలా డి యెన్ ఏ పాటర్న్ లని అది బ్రేక్ చేస్తుంది.
- మీతో ఉన్న చాలా పాటర్న్ లు , అది పొగ త్రాగే అలవాటు కావచ్చు,డ్రగ్,ఆల్కహాల్,హింస,మెంటల్ బ్రేక్ డౌన్,ఫ్లెరింగ్ అప్,పానిక్ అట్టాక్ లు,అబ్ససేస్సివ్ కంపల్సివ్ డిసార్డర్ - ఇవన్నీ 3 లెవెల్ లు కలిగి ఉంటాయి.మజిల్ మెమరీ లెవెల్ ,బయో మెమరీ లెవెల్, డి యెన్ ఏ లెవెల్.
- ఒక లావుగా ఉన్న వ్యక్తి నిరాహార సంయమ చేస్తే ,అతని సొంత శరీరం తన సొంత శరీరాన్ని తింటుంది.అతను ఆరోగ్యాంగా తయారు అవుతారు,మామూలు ఆరోగ్యకరమైన బరువుకి వస్తారు.ఆ సమయానికి అతని డి యెన్ ఏ లెవెల్ పాటర్న్ లు మారిపోతాయి,నిర్విషీకరణ ( DETOXED ) లా ఉండాలి.
- 18 లోపు పిల్లలు కూడా నిరాహార చేయవచ్చు,కానీ ఇప్పుడు కాదు.ఎందుకంటే మీ దేశం లో చట్టం అనుమతించక పోవచ్చు.పిల్లలను పెంచుతున్నప్పుడు మీరు వారికీ నేర్పించాలి,నెలకు ఒకసారి,కనీసం రెండు రోజులు ,DELAYED GRATIFICATION ని అలవాటు చెయ్యాలి.
- కోరిక పుట్టినప్పుడు వెంటనే దానిని తీర్చకూడదు.పిల్లలు పెరుగుతున్నప్పుడు,14 వచ్చేసరికి ,నెలకు ఒకసారి నిరాహార చేసేలా వారికీ నేర్పించాలి.శక్తిని పెంచుకోవడం,మీరు కండరాలు ఎలా పెంచుతారో అలాగే,మీరు చేతనస్థితిని మరియు అవకాశాలను పెంచుకోవాలి.
- వారానికి ఒకసారి పొట్టకి బ్రేక్ ఇవ్వండి.సప్లిమెంట్స్ మాత్రమే తీసుకోండి.మీ ఆయుర్వేద డాక్టర్ ని,సిద్ధ డాక్టర్ ని,డైటీషియన్ ని సంప్రదించండి.కానీ కడుపులో భారాన్ని పెంచడం ఆపండి. మీరు చాలా,చాలా అవగాహనతో,శక్తివంతంగా జీవించడం మొదలుపెడతారు.
- నా పిల్లలు నిరాహార చేస్తున్నట్టు,గ్రంధాలు చదువుతున్నట్లు నాకు మెసేజ్ చేస్తే ,నా కొడుకులు,కూతుర్లు పెరుగుతున్నారు అని నాకు తెలుస్తుంది.
- ఈ నాగరిక ప్రపంచంలో పిల్లలు ఇలాంటి మంచి పనులకు అలవాటు పడుతున్నారు , నా పిల్లలు ఇవన్నీ చేస్తున్నారు అని నేను చూసినప్పుడు నాకు తెలుస్తుంది,నేను నా కూతుర్లను,కొడుకులను పెంచుతున్నాను.
- तपो ब्रह्मेति
తపో బ్రహ్మెతి తైత్తిరీయ ఉపనిషత్తులలో భ్రిగు వల్లి ఇలా చెపుతుంది: `తపస్ బ్రహ్మన్`-తపో బ్రహ్మెతి !
- ఎప్పుడైతే నా పిల్లలు నిరాహార చేస్తున్నారో,గ్రంధాలు చదువుతున్నారో,వారి డి యెన్ ఏ లెవెల్ లోని పాటర్న్ లు బ్రేక్ అయ్యాయి అని నాకు తెలుసు,మరియు ఇది అంతా క్లియర్ అయింది.
- బద్దకం,అహకారం,బ్రాంతి,ఇవన్నీ డి యెన్ ఏ లెవెల్ పాటర్న్ లు .నిరాహార సంయమ తో,గ్రంధాలు చదవడం తో ఇవన్నీ పోతాయి.
- ఈ 36 తత్వాలలో గొప్పది శివ తత్వ.అత్యల్పమైనది పంచ మహా భూతాలు. ఈ పంచ మహా భూతాల మూలం భూమి,నీరు,గాలి,అగ్ని,స్పేస్ .అది పంచ మహా భూతాలు.
- ఈ 36 మొత్తం పరమశివ వ్యక్తం చేసినవి.అది తెలుసుకుని,మీరు పరిపక్వము పొందుతారు,దేనికి అలవాటు పడాలో మీకు తెలుస్తుంది,మరియు దేనిని నివారించాలి .పరిపక్వము మీలో కలుగుతుంది.
- నా పిల్లలు పరిపక్వము కలిగివుండటం నేను గమనిస్తే నేను చాలా గొప్పగా అనుభూతి చెందుతాను.నా ఉనికి పునీతమైనది! లేకపోతే ఇన్ని సమస్యలు ఎదుర్కుంటూ నేను ఎందుకు ఉండాలి . నేను వున్నాడు ఒకేఒక్క కారణం .తపస్సు చేసే పిల్లలకోసం,వారో కోసం! ఎందుకంటే వారికీ శక్తులను ఇచ్చి,వారిలో పరమశివ ని మానిఫెస్ట్ చేయాలి ,నేను అందుకే బ్రతికి ఉండాలని నాకు తెలుసు.
- ఈ ప్రళయ కాలంలో నా పిల్లలు నిరాహార చేయాలని కోరుకున్నప్పుడు,నాకు తెలిసింది,వారికీ శక్తులను ఇచ్చి వారిలో పరమశివ వ్యక్తీకరించేలా చేయడం కోసం నేను బ్రతికి ఉండాలి.
- తపస్సు,తపస్సు,తపస్సు
- జీవితం యొక్క ఉత్తమ యదార్దాన్ని తపస్సు ద్వారా తెలుసుకోవాలి.
- తైత్తిరీయ ఉపనిషత్తులు ఇలా చెపుతాయి:
तपसा ब्रह्म विजिज्ञासस्व తపసా బ్రహ్మ విజిజ్ఞాసావా - బ్రహ్మని తపస్సు ద్వారా తెలుసుకో.
- ప్రపంచం మొత్తం లో ఈ సత్సంగ్ వింటున్న వారందరు ఒక నిర్ణయం తీసుకోవాలి.ఈ 36 తత్వాల గురించి మీరు చదవాలి,మరియు మీ చేతనస్థితిని పరిపక్వము చేసుకోవాలి.
- రెండవది, సులభమైన విషయం,సూర్యాస్తమయం తరువాత మీకు ఆకలి అనిపిస్తే,అది అబద్దపు ఆకలి,తడి బట్టను వేసుకోండి,ఆహరం కాదు.
- ఈ రోజు సత్సంగ్ యొక్క సారాంశం :
ఈ 36 తత్వాలను అర్ధం చేసుకోండి. తపస్సు మీ ఆత్మకి పరిపక్వత అని తెలుసుకోండి.తపస్సు ద్వారా మీ ఆత్మ పరిపక్వము చెందుతుంది. తైత్తిరీయ ఉపనిషత్తులలో,భ్రిగు వల్లి ఇలా చెపుతుంది: तपसा ब्रह्म विजिज्ञासस्व అర్ధం బ్రహ్మని తపస్సు ద్వారా తెలుసుకో तपसो हि परं नास्ति तपसा विन्दते महत् ॥ तपसा क्षीयते पापं मोदते सह दैवतैः । तपसा प्राप्यते स्वर्गस्तपसा प्राप्यते यशः ॥ तपसा सर्व्वमाप्नोति तपसा विन्दते परम् । అనువాదం అగ్ని భగవాన్ ఇలా చెపుతారు తపస్సుకు మించినది లేదు. తపస్సు ద్వారా, గొప్ప విజయాలను సాధించవచ్చు తపస్సు ద్వారా ,పాపాలు పోతాయి. తపస్సు ద్వారా, ఒకరు దేవునిలో ఒకరైపోతారు. తపస్సు ద్వారా, స్వర్గాన్ని జయించవచ్చు . తపస్సు ద్వారా ,పేరుని,కీర్తిని,అనుగ్రహాన్ని పొందవచ్చు. తపస్సు ద్వారా, అన్నింటిని సాధించవచ్చు. తపస్సు ద్వారా , బ్రహ్మన్త్ యొక్క అతుత్తమ స్థితిని మానిఫెస్ట్ చేయవచ్చు.
- ప్రపంచం లో హిందూ సంఘాలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకి కారణం తపస్సు యొక్క బలాన్ని తగ్గించడం.నేను ఇలా చెపుతాను,ప్రపంచం మొత్తం మీద ఉన్న హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నిటికి మూల కారణం ఏమిటంటే,తపస్సు జీవన శైలి పోవడమే.ప్రపంచం మొత్తం మీద హిందువులు అనుభవిస్తున్న మంచి విషయాలు ,సంతోషం, ఎందుకంటే ,తపస్సు ఎలా చేయాలో మీకు తెలుసు.మీరు విజయవంతులు ! మీరు తపస్సు జీవనశైలిని తప్పినప్పుడు,మీరు ఇది పోగొట్టుకున్నారు.కాబట్టి తపస్సు దీనికి పరిష్కారం.తపస్సు దీనికి పరిష్కారం.
- నేను నా పిల్లలు అందరికి ఈ మంత్రం ద్వారా దీక్షని ఇస్తున్నాను.పద్మాసనంలో కూర్చోండి.పదం తరువాత పదం .నేను చెప్పాక మీరు చెప్పండి.
- तपसो हि परं नास्ति तपसा विन्दते महत् ॥
तपसा क्षीयते पापं मोदते सह दैवतैः । तपसा प्राप्यते स्वर्गस्तपसा प्राप्यते यशः ॥ तपसा सर्व्वमाप्नोति तपसा विन्दते परम् । తాపసోహి పరం నాస్తి తపసా విన్దతే మహత్ తపసా కేసియతే పాపం మోదతే సహ దైవతైహ్ తపసా ప్రాప్యతే స్వర్గస్తపసా ప్రాప్యతే యష తపసా సర్వమాప్నోతి తపసా విన్దతే పరం అనువాదం: అగ్ని భగవాన్ ఇలా చెపుతారు తపస్సుకు మించినది లేదు. తపస్సు ద్వారా, గొప్ప విజయాలను సాధించవచ్చు తపస్సు ద్వారా ,పాపాలు పోతాయి. తపస్సు ద్వారా, ఒకరు దేవునిలో ఒకరైపోతారు. తపస్సు ద్వారా, స్వర్గాన్ని జయించవచ్చు . తపస్సు ద్వారా ,పేరుని,కీర్తిని,అనుగ్రహాన్ని పొందవచ్చు. తపస్సు ద్వారా, అన్నింటిని సాధించవచ్చు. తపస్సు ద్వారా , బ్రహ్మన్త్ యొక్క అతుత్తమ స్థితిని మానిఫెస్ట్ చేయవచ్చు.
- ఈ దీక్ష ద్వారా ఈ శక్తివంతమైన జ్ఞానం మీలో యదార్ధం అవుతుంది.దయచేసి ఈ పద్యాన్ని ,అర్ధాన్ని కొన్ని సార్లు చదవండి.
- నా పిల్లలు అందరూ ఒరిజినల్ సంస్కృత పద్యం,ఇంగ్లీష్ అనువాదం 108 సార్లు వ్రాయాలి.అప్పుడు అది మీ డి యెన్ ఏ లో భాగం అవుతుంది.
దీక్ష:
ఈ రోజున హిందూ మతం యొక్క సుప్రీం పోంటిఫ్ భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం గురుకుల వాసులను తపస్సుకై మంత్రంలోకి దీక్షను ఇచ్చారు.
పద్మాసనంలో కూర్చున్న తరువాత గురుకుల్ పిల్లలు పఠించారు:
तपसो हि परं नास्ति तपसा विन्दते महत् ॥
तपसा क्षीयते पापं मोदते सह दैवतैः ।
तपसा प्राप्यते स्वर्गस्तपसा प्राप्यते यशः ॥
तपसा सर्व्वमाप्नोति तपसा विन्दते परम् ।
తాపసోహి పరం నాస్తి తపసా విన్దతే మహత్
తపసా కేసియతే పాపం మోదతే సహ దైవతైహ్
తపసా ప్రాప్యతే స్వర్గస్తపసా ప్రాప్యతే యష
తపసా సర్వమాప్నోతి తపసా విన్దతే పరం
అనువాదం:
అగ్ని భగవాన్ ఇలా చెపుతారు
తపస్సుకు మించినది లేదు.
తపస్సు ద్వారా, గొప్ప విజయాలను సాధించవచ్చు
తపస్సు ద్వారా ,పాపాలు పోతాయి.
తపస్సు ద్వారా, ఒకరు దేవునిలో ఒకరైపోతారు.
తపస్సు ద్వారా, స్వర్గాన్ని జయించవచ్చు .
తపస్సు ద్వారా ,పేరుని,కీర్తిని,అనుగ్రహాన్ని పొందవచ్చు.
తపస్సు ద్వారా, అన్నింటిని సాధించవచ్చు.
తపస్సు ద్వారా , బ్రహ్మన్త్ యొక్క అతుత్తమ స్థితిని మానిఫెస్ట్ చేయవచ్చు.
ఛాయాచిత్రాలు:
ఫేస్-బుక్ పేజీ లింకులు
https://www.facebook.com/srinithyananda.swami/posts/1741173509370974
https://www.facebook.com/ParamahamsaNithyananda/posts/4300466486707835