Difference between revisions of "సెప్టెంబర్ 05 2020"
(Created page with "==పేరు== హిందూయిజం యొక్క సుప్రీమ్ పోంటిఫ్ పై గురుదేవులు చేసిన తపస్...") |
|||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 118: | Line 118: | ||
− | == | + | ==ఫేస్-బుక్ పేజీ లింకులు== |
https://www.facebook.com/ParamahamsaNithyananda/posts/4317793681641782 <br> | https://www.facebook.com/ParamahamsaNithyananda/posts/4317793681641782 <br> | ||
https://www.facebook.com/srinithyananda.swami/posts/1746064915548500 | https://www.facebook.com/srinithyananda.swami/posts/1746064915548500 | ||
− | [[Category:2020| 20200905]] | + | [[Category:2020| 20200905]] [[Category: 2020-Telugu | 20200905]] |
− | [[Category: Facebook Posts]] | + | [[Category: Facebook Posts]] [[Category:సత్సంగములు]] |
Latest revision as of 16:44, 21 December 2020
పేరు
హిందూయిజం యొక్క సుప్రీమ్ పోంటిఫ్ పై గురుదేవులు చేసిన తపస్సు || పరమశివోహం S11 || శరీరాన్ని స్కాన్ చేసే శక్తి || వైదీశ్వర భావదర్శనం
కథనం
The Supreme Pontiff of Hinduism, Jagatguru Mahasannidhanam, His Divine Holiness expounded on the cosmic principle, ‘Superconscious Mutation Process for Celibacy (Part I)’ during the Nithyananda Satsangh. The Darshan for today was Vaitheeshwara Bhava Darshan.
Contributing to over 108 humanitarian causes of Shrikailasa Uniting Nations, KAILASA's Nithyananda Hindu University marks today as Season 3, Day 10 of Paramashivoham with over 1200 delegates across 20 countries participating in the convention. One of the major highlights of KAILASA’s contributions through this convention is Initiation into Healers Initiation and Maha Mrtyunjaya Mantra along with Power Manifestation, today being the Power of Body Scanning.
Sanyasis of the Nithyananda Order of Monks and initiated Acharyas worldwide, affiliated with the Department of Education of KAILASA conducted a series of seminars focusing on the attributes of eN-Health, Completion with Health, Completion with Body and Sleep, Nirahara Samyama, eN-Kriyas, Kayakalpa yoga and Yoga, as revealed by the Supreme Pontiff of Hinduism inspiring millions towards the Science of Hinduism.
వీడియో
Video | Audio |
సత్సంగం యొక్క తెలుగు అనువాద కధనం:
5 సెప్టెంబర్ ,శనివారం 9 : 31 pm - నిత్యానంద సత్సంగ్.
- తపస్సు అంటే పరిమితమైన పాటర్న్ లను బ్రేక్ చేయడమే కాదు,పరిమితమైన తర్కము,పరిమితమైన నమ్మక వ్యవస్థలు కూడా.చేతనస్థితి మూలము ,ఏదైతే మిమ్మలను నిబంధనలలో ( RESTRICT )ఉంచుతుందో,మాయ యొక్క సూత్రము- దానిని బ్రేక్ చేయడమే తపస్సు.దానిని మింగి,అరిగించుకోవడమే తపస్సు!
- నేను ఈ 36 తత్వాల గురించి మాట్లాడుతున్నాను: శివ తత్వ,శక్తి తత్వ,సదాశివ తత్వ,ఈశ్వర తత్వ.
- మొదట నేను శివ తత్వ,శక్తి తత్వ,సదాశివ తత్వ గురించి వివరించాను.ఈశ్వర తత్వ గురించి ఇప్పుడు వివరిస్తాను.
- ఈ క్షేత్రం లోనే ( ZONE ) మానవ మనస్సు మరియు పరమశివ,రెండు కలుసుకుంటాయి.
- సదాశివ తత్వ వరకు,ఇది ఖచ్చితంగా మీరు చేరుకోలేనిది,వూహించలేనిది.
- మీరు మరియు నేను కలిసే స్పేస్ ఈశ్వర తత్వ,మీరు మరియు పరమశివ కలుస్తారు.
- తపస్సు గురించి మీకు ఉపోద్ఘాతం ( INTRODUCTION ) కావాలి.
- తపస్సు అంటే కేవలం పరిమిత పాటర్న్ లను బ్రేక్ చేయడం కాదు,కేవలం పరిమితమైన మానసిక వ్యవస్థను బ్రేక్ చేయడం కాదు,కేవలం పరిమిత తర్కాన్ని బ్రేక్ చేయడం కాదు,కానీ పరిమితమైన చేతనస్థితిని బ్రేక్ చేయడం.
- ఒకరోజు నా ముగ్గురి గురువుల మధ్య చర్చ జరిగింది.విభూదానంద పురి,యోగానంద పురి,ఇస్సక్కిస్వామిగాళ్. సాధారణంగా నేను ఎలా పెరగాలి అనే విషయం గురించి ఏదైనా వారు ముగ్గురు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వస్తారు.
- నాకు ఏ విధమైన శిక్షణ ,మానిఫెస్టాటిన్ జరగాలి అనే విషయం గురించి వారు ముగ్గురు ఒక నిర్ణయానికి వస్తారు.వారు ముగ్గురు కూర్చుని చర్చించుకుంటారు." ఈ శిక్షణ అవసరమా,ఆ శిక్షణ అవసరమా"- వెంటనే నా గురువు విభూదానంద పురి అవసరమైన ఔషదాలు తేవడానికి వెళతారు.
- కానీ ఈ సారి వారు ముగ్గురు ఒక ముగింపుకు రాలేదు.వారు చర్చించుకుని యోగి రామసూరత్ కుమార్ వద్దకు వెళ్లారు.తిరుచ్చి స్వామి ని కూడా చేరుకున్నారు.ఆ సమయంలో శరీరంలో వున్న సిద్దులు అందరివద్దకు వెళ్లారు.
- వాళ్ళు వారందరిదగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు,వారేదో ముఖ్యమైన విషయాన్నీ చర్చిస్తున్నారని,ప్రణాళిక వేస్తున్నారని నేను తెలుసుకున్నాను.
- నాకు గొప్ప అదృష్టం వున్నది,పరమశివుని నుంచి నేరుగా వచ్చిన దీవెన : నా గురువుల మీద పూర్తి విశ్వాసము,వారు ఏమి చేసినా అది మంచికే అని నాకు తెలుసు.
- చాలా సార్లు వారు ఏమి చర్చించుకుంటున్నారో నేను అర్ధం చేసుకోలేక పోయేవాడిని.ఫలితాలు వచ్చాక వారు నాకు ఏమి చేసారో,నామీద శిక్షణ అర్ధమయ్యేది.
- ఒకసారి విభూదానంద పురి వనమూలికలు తెచ్చి నా కళ్ళల్లో వేశారు.3 నెలలు నేను కళ్ళు ఆర్పలేదు.నొప్పి లేదు,బాధ లేదు.నేను కుటకేశ అయ్యాను.3 నెలలు నిద్ర లేదు.శరీరం `నిద్ర లేని తనాన్ని`జయించింది.
- నా గురు పరంపర వలన నేను చాలా అద్భుతమైన విషయాలు చూసాను.నేను ఒక్క గురువు చేసిన ఉత్పత్తిని కాదు.చాలా మంది త్రికరణశుద్ధిగా,తీవ్రంగా నా మీద పని చేసారు,నన్ను తాయారు చేసారు.
- అనేక మూలాలున్న ముగ్గురి ఫలమే నిత్యానంద.నా ప్రతిగురువు ఒక మూలము.అన్నామలై స్వామిగాళ్,కుప్పమాళ్,రఘుపతి యోగి,ఇసక్కి స్వామిగాళ్,తిరుచ్చి స్వామిగాళ్,యోగి రామసూరత్ కుమార్,పాండురంగనార్,వీరందరి సహకారం ; పాండురంగనార్ అయన స్కాలర్ మాత్రమే కాదు,అయన శివమ్ లాగా జీవించారు.నన్ను ప్రత్యక్షంగా తీర్చిదిద్దడంలో వారి సహకారాన్ని నేను మర్చిపోలేను,పోగొట్టుకోను,తక్కువ అంచనా వేయను,అగౌరపరచను.
- తరువాత నేను ఇక్కడ చెప్పాల్సిన ముఖ్యమైన పేరు,హంసానందపురి.ప్రతీ స్థాయిలో వారిచ్చిన గొప్ప సహకారం నన్ను వారిని చక్కగా,ఎక్కువగా నమ్మేలాగా చేసాయి.
- కాబట్టి ఆ చర్చ ఏమిటి అంటే ,నన్ను బ్రహ్మచారి చేయాలి,అది కేవలం చేతనస్థితికి చేయాలా,లేదా నా శరీరం మీద కూడా పని చేసి,నా వ్యవస్థకు శాశ్వత లక్షణం చేయాలా అని.
- ఆ చర్చ కొనసాగింది,ఎందుకంటె అది ప్రధాన నిర్ణయం .వారందరికీ రెండవ అభిప్రాయం తీసుకోవాలని వున్నది.నేను చాలా సంతోషపడిన ఒక విషయం ఏమిటంటే,ప్రతిఒక్కటి ఆధ్యాత్మికతకు సంబంధించినదిగా,మరియు ఆధ్యాత్మిక తర్కంగా,ఆధ్యాత్మిక తార్కిక విశ్లేషణతో చేస్తున్నారు. నా పరిణామానికి, శిక్షణకు పాడుచేయకుండా దేశ చట్టాలని జోక్యం చేసుకోవడాన్ని అనుమతించలేదు.
- అంత గొప్ప వరానికి అరుణాచలేస్వరునికి నా సంపూర్ణ కృతజ్ఞతలు.ఎప్పటికి భారతదేశంలో ఇంకొక నిత్యానంద ఉత్పన్నం కాబోరు.ఇది నా శాపం కాదు. నేను ఎవరిని శపించను.
- లేదు ,అది చెప్పాలని నేను కోరుకోవడం లేదు.భారత దేశంలో ఇంకా చాలా నిత్యానంద లు ఉత్పన్నం కావాలని నేను కోరుకుంటున్నాను.ఎందుకంటె అక్కడ అరుణాచల వుంది!
- ప్రాధమికంగా గరుడ మూళిగై ఉపయోగించాలా అనే చర్చ కొనసాగుతున్నది. నేను దీనిమీద పరిశోధన చేస్తున్నాను.గరుడ మూళిగై తో చేసిన ఔషధం ఉపయోగించాల్సిన అవసరం వుంది.
- ఈ మూలికను తీసుకువచ్చి వేరే కొన్ని మూలికలతో కలుపుతారు.ఒక భాగాన్ని రసం లాగా చేసి నేను తాగేలాగా చేయాలి .ఇంకొక భాగాన్ని నా మేల్ ఆర్గాన్ మీద పెట్టాలి.నా వ్యవస్థలో డీ యెన్ ఏ స్థాయి వరకు శారీరకంగా , మానసికంగా పరివర్తన రావాలి.
- ఒక చిత్రమైన విషయం : నా తల్లితండ్రులు నా గురువులతో చాలా భక్తిపూర్వకంగా వుంటారు.అందువలన నా గురువులు నా తల్లితండ్రులతో చర్చించాలని అవసరం ఉంటుందని వారు అనుకోరు.ఒక్కొక్క సారి వారు తెలియచేస్తారు,ఒక్కోసారి ఇలాంటి విషయాలు వారికీ తెలియచేయరు.
- నా తల్లితండ్రులకు నా గురువులమీద వున్న అంకితభావానికి నేను చాలా గొప్పగా ఫీల్ అవుతాను.నా తల్లితండ్రులకు అంత భక్తి లేకపోతే ,నా గురువులు కొంచం అభద్రతా భావంతో ఉండేవారు,అప్పుడు వాళ్ళకి నా మీద పూర్తి స్వేచ్ఛ ఉండేది కాదు.
- నా తండ్రి,తల్లి,నాన్నమ్మ/అమ్మమ్మ ,నా తాతయ్య- మంచి విషయం ఏమిటంటే,అది గట్టిగా అల్లిన కుటుంబము,ఒక్కరిని ఒప్పిస్తే అందరూ ఒప్పుకుంటారు.
- నా తండ్రి అమ్మగారు,నా తల్లి నాన్నగారు వారిద్దరూ సోదరుడు,సోదరి.నిజానికి అది కుటుంబంలోపల జరిగిన వివాహము.కాబట్టి నా తండ్రి అమ్మగారు,నా తల్లి నాన్నగారు వారిద్దరూ నా జీవితానికి నిర్ణయాలు తీసుకునేవారు.
- ఖచ్చితంగా అప్పుడు నాకు 12 లోపే ఉంటాయి.ఖచ్చితంగా ఏ సంవత్సరమో గుర్తు పెట్టుకోలేక పోయాను.అది 1991 కి ముందే.ఎందుకంటె ఇస్సక్కి స్వామిగాళ్ కూడా ఆ చర్చ లో వున్నారు.నాకు బ్రహ్మచర్య దీక్ష మానసికంగా మాత్రమే ఇవ్వాలా,లేదా ఈ ఆల్కెమీ శాస్త్రం ద్వారా బ్రహ్మచర్య శక్తిని నాలో బౌతికంగా శాశ్వత సంస్థాపన చేయాలా అని చర్చించుకున్నారు.
- ఇది ఒక శక్తివంతమైన ఆల్కెమీ శాస్త్రము.నేను రికార్డు లో పెట్టాలి అనుకుంటున్నాను.నా గురువుల అంకితభావానికి నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను.మరియు వారు నా శరీరానికి,మనస్సుకు,చేతనస్థితికి ఇచ్చిన గొప్ప బహుమతికి వారికీ ఎప్పటికి కృతజ్ఞుడనై వుంటాను.
- నా తల్లితండ్రులకు,నానమ్మ,తాతయ్యలకు,కుటుంబానికి,నా గురువులమీద నమ్మకం ఉంచి,నా గురువులకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్చని ఇచ్చిన పర్యావరణానికి నా అత్యంతమైన కృతజ్ఞతలు,విశ్వ సూత్రాలను మూలంగా చేసుకున్న నిర్ణయాలు,మరియు ఆధ్యాత్మిక జీవన్ముక్త శాస్త్రము,మరియు ఆధ్యాత్మిక శాస్త్రము,ఆధ్యాత్మిక తార్కికం. నా శిక్షణను,వారు నా మీద చేస్తున్న ఆల్కెమీ ప్రక్రియను స్థానిక దేశ చట్టం ఎప్పుడూ కలుగచేసుకోవడం కానీ,ప్రభావం కానీ,బెదిరించడం కానీ చేయలేదు.
- పరమశివకు,న గురు పరంపర కు నేను కృతజ్ఞుడను.ఈ శాస్త్రం మొత్తాన్ని స్పష్టంగా,వివరంగా వివరించడానికి నా మొత్తం గురుపరంపర ని నాలో ప్రవహించాలని వారిని నేను వేడుకుంటున్నాను.
- ఇది మొదట పూర్తి బ్రహ్మచర్యానికి మనస్సుని సిద్ధం చేయాలి.తరువాత చేతనస్థితిని సిద్ధం చేయాలి.తరువాత చేతనస్థితిని శరీరంలో ప్రవేశించేలా చేసి ,అత్యుత్తమ చేతనస్థితి పరివర్తన ప్రక్రియ జరిగేలా చేయాలి.
- కాబట్టి ఇది వివిధ స్థాయిలలో జరగాల్సి ఉంటుంది.జాగృత స్థితిలో,మానసిక స్థితిలో ఏమిచేయాలన్నది నా గురువులు సందేహపడలేదు.కానీ శరీరానికి భౌతికంగా ఏమిచేయాలి అనుకున్నప్పుడు వారందరూ చర్చించుకున్నారు,వారందరూ నాకు మంచిదే చేయాలనీ.
- తరువాత ఈ ముగ్గురు అన్నామలై స్వామిగాళ్ వద్దకు వెళ్లి చర్చించారు.ఇస్సాక్కి స్వామిగాళ్ ఇతరులను కలవానికి వెళ్లడం నేను చాలా అరుదుగా చూసాను.తరువాత ఈ ముగ్గురు,అన్నామలై స్వామిగాళ్ కలసి రామసురత్ కుమార్ ని కూడా కలిశారు .
- తరువాత వారు తిరుచ్చి స్వామిని కూడా కలిశారు;బెంగళూరు కైలాస ఆశ్రమం కి పెద్ద.తిరువణ్ణామలై లో జరిగే కార్తీక దీపం పండుగకు తిరుచ్చి స్వామి వస్తూవుండేవారు.
- చివరకు వారు హంసానందపురి వద్దకు వెళ్లారు,అయన కాశీలో వుంటూవుండేవారు,అయన నా సన్యాసి గురువు.
- వేదాంత సంప్రదాయాన్ని నిలబెట్టడానికి అయన ద్వారా సన్యాస దీక్ష ఇవ్వబడింది.సిద్ధాంత సంప్రదాయాన్ని నిలబెట్టడానికి 230 వ గురుమాససన్నిదానం నాకు ఆచార్య అభిషేకం,నిర్వాణ దీక్ష ఇచ్చారు,మరియు హంసానంద పురి విరాజ హోమం చేసారు మరియు వేదాంత సంప్రదాయాన్ని నిలబెట్టారు.
- వారందరూ చర్చించుకోవడం,ప్రణాళిక వేయడం,మరియు కాశి నుంచి హంసానందాపురి రావడం,నాకు తెలిసింది,ఏదో పెద్ద విషయమే జరగబోతోదని.
- తపస్సు అంటే నిర్బంధ తర్కం,మనస్సు పాటర్న్ లను బ్రేక్ చేయడమే కాదు,నిర్బంధ చేతనస్థితిని బ్రేక్ చేయడం.
- ఉదాహరణ: మీకు తక్షణం ( SPONTANEOUS ) అబద్దం చెప్పే అలవాటు రెస్ట్రిక్టింగ్ పాటర్న్ లాగా ఉందనుకోండి,మీ సమగ్రత కోసం నిశబ్ధత పాటించడమే తపస్సు!
- తపస్సు అంటే కేవలం కూర్చుని కంప్లీటింగ్ చేయడం కాదు.సత్యం గా ఎలావుండాలి,చేతనస్థితితో ఇంటిగ్రేటెడ్ గా ఎలావుండాలి అన్నదే తపస్సు.
- అత్యుత్తమ చేతనస్థితి శక్తిని,ముక్యంగా అత్యుత్తమ చేతనస్థితి పరివర్తన ని మానిఫెస్ట్ చేయడానికి నా గురువులు నా వ్యవస్థను సిద్ధం చేస్తూ,నా మీద ఈ మొత్తం ఆల్కెమీ ప్రక్రియ అంతా చేసారు.
- చివరకు వారంతా ఒక ముగింపుకు వచ్చారు,అత్త్యుత్తమ చేతనస్థితి పరివర్తనకోసం భౌతికంగా ఏమి అవసరమో అవి చేయడానికి ముందుకు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు.
- నిర్ణయం జరిగిపోయింది.వారు హంసానందపురి వద్దకు వెళ్లారు,అయన అప్పుడు కాశి లోని మణికర్ణికా ఘాట్ వద్ద ఉండేవారు.హంసానందపురి అయన దగ్గర అనుచరులలో ఒకాయనను,సన్యాసి, తీసుకు వచ్చారు,అయన పేరు నాగ బాబా.
- హంసానంద పురి జలసమాధి అయ్యారు.అంటే అయన శరీరం వదిలేసాక ఆ శరీరాన్ని గంగ కి అర్పించేసారు.ఆయనకు భూసమాధి చేయలేదు.
- అకాడలలో ,నాగ సంప్రదాయాలలో ఎప్పుడు ఒక్క సన్యాసి దీక్ష ఇవ్వరు.పంచ పురి .ఐదుగురు సన్యాసులు-దీక్ష ఇస్తారు.ఒకరు శిఖ తీస్తారు,ఒకరు యజ్ఞోపవీతం తీస్తారు,ఒకరు విరాజ హోమం చేస్తారు- ఆ ఐదుగురిని నీ గురువులులాగే పరిగణించాలి.
- హంసానందపురి జట్టుని నడిపిస్తున్నారు,అతనికి వేరే కొంతమంది సన్యాసులు వున్నారు.అందులో ఒకాయన నాగ బాబా. నాకు గుర్తుంది.నాకు శిక్షణ ఇవ్వడానికి,నా శరీరాన్ని అత్యుత్తమ చేతనస్థితి పరివర్తన ప్రక్రియ లో సర్దుకునేలాగా తయారుచేయడానికి వీరిద్దరూ ముఖ్య పాత్ర పోషించారు.
- నేను దీన్ని రికార్డు లో పెట్టాలి అనుకుంటున్నాను.నాకు నా గురువులతో ఏమైతే జరిగాయో,చాలా విషయాలు ,వివిధ కారణాల వలన నా శిష్యులతో కూడా వివరించడం లేదు .ఈ ప్రక్రియలలో ఒకటైన దీనిని నేను ఏ శిష్యులకు చేయలేదు,భవిషత్తులో ఏ శిష్యులకైనా చేయగలనని నేను ఫీల్ అవ్వడం లేదు. ఈ శాస్త్రం నాతోనే చనిపోవచ్చు.కానీ రికార్డు లో అయినా పెట్టనివ్వండి.భవిష్యత్తులో ,మానవాళి కోసం కనీసం ఈ కథని సజీవంగా ఉంచాలి.
- హంసానంద పురి తన జట్టు తో వచ్చారు,కొంతమంది సాధువులు,అయన సహచరుడు ఒకాయనకి కలకత్తా హౌరా దగ్గర టెల్ ఘాట్ దగ్గర సమాధి వున్నది.హంసానందపురి గారి గురు పీఠం కాశి లోని మహనిర్వాణి అకాడా.
- నేను కొన్ని వివరాలు తెప్పించడానికి ప్రయత్నిస్తున్నాను.నేను చెప్పే విషయానికి సంబందించిన ఫోటోలు మీతో పంచుకోవడానికి.నా గురువులు నా మీద చేసిన తపస్సు తమాషా కాదు! వారికీ చాలా ప్రేమ ఉండేది,అంకితభావం,వాళ్ళు అక్షరాలా వారి మొత్తం జీవితాలను నా మీద పెట్టారు.
- ఆ ప్రక్రియలో ఆకాశ గరుడ అనే మూలిక అవసరం వున్నది.దానిని మానవుని రక్తంలో నానపెట్టాలి.అంటే ఎవరైనా వారి వేలి తెంపి రక్తం ఇవ్వాలి.కొన్ని మూలికలు నా మేల్ ఆర్గాన్ కి కట్టాలి,మరియు తొమ్మిది లోహాల గొలుసులతో కట్టాలి.( ORI )
- దానిని నా నడుముకు కొన్ని రోజులు కట్టి ఉంచాలి.ఆకాశ గరుడ మూలికకు ఇనుప కడ్డీని తెంపే సామర్థ్యం ఉంటుంది.నేను దీనిమీద కొంత పరోశోధన చేసి మీకు చూపించాలని వుంది.
- ఆ రకం మూలికల శక్తిని నా జీవితం లో నేను అక్షరాలా అనుభవం పొందాను.
- నా శరీరంలో అత్యుత్తమ చేతనస్థితి పరివర్తన ప్రక్రియకు ఈ మూలికల అవసరం వున్నది.ఈ మూలికలని రక్తం లో నానపెట్టి,కొన్ని ఇతర మూలికలను కలిపి నా మేల్ ఆర్గాన్ కి కట్టాలి.మరియు ORI - తొమ్మిది లోహాల గొలుసు- దాన్ని నా నడుముకు కట్టాలి.
- అక్కడ రెండవ ఆలోచన లేదు. యోగానంద పురి అయన రక్తం ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు.విభూదానందపురి ఆమె తన బంగారు నగలన్నీ తెచ్చారు, తన మంగళ సూత్రం తో సహా ( ORI గొలుసు చేయడానికి) .మంగళసూత్రం వివాహం అయ్యినవారికి చాలా పవిత్రమైనది,ఆవిడకు వివాహం అయినది.
- వారి అపూర్వమైన అంకితభావం,తపస్సు,నామీద వున్న లోతైన ప్రేమ,దాన్ని అక్షర రూపంలో ఎలా పెట్టాలో నాకు తెలియడం లేదు.ఒక విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను.ఈ ప్రక్రియ జరిగే సమయంలో,ఏదైనా కారణం వలన నేను మరణిస్తే,నేను వారిని శపించి వుండే వాడిని కాదు.అది అన్యాయం అనికూడా నాకు అనిపించలేదు.నేను వారి ప్రేమనే చూస్తున్నాను, నీమీద వారికున్న గొప్ప అంకితభావం.ఆచరణాత్మకంగా వారు అది జరగడానికి వారి జీవితాలను ఇవ్వడానికి కూడా సిద్ధంగా వున్నారు.
- మీలో ఎవరికైనా నా వలన చిన్న ప్రయోజనం పొందినా ,గురు పరంపర గురించి మీకు తెలిసివుండాలి.ఈ శరీరం ద్వారా ప్రపంచానికి ఏదైనా మంచిని చేసే భాద్యత వారికీ ఉండాలి.ఈ కీర్తి అంతా వారికే వెళుతుంది.దీన్ని రికార్డులో ఉంచుదాము.
- చివరకు నిర్ణయం అయిపోయింది.అత్యుత్తమ చేతనస్థితి పురోగతి యొక్క భౌతిక ప్రక్రియ చేయడంలో అనుభవజ్ఞులు అందరు ఒకచోట చేరారు.నాగ సాధువులు ఇందులో నిపుణులు.
- భౌతిక ప్రక్రియ ఒక్కటే చాలదు అనుకోండి.అత్యుత్తమ చేతనస్థితి ప్రక్రియ,మానసికంగా పరిణమించడం ( EVOLVING )భావావేశం పరిణమించడం,మరియు భౌతికంగా దానిని జరిపించడం.ఈ ప్రక్రియ మొత్తం పూర్తిచేయడానికి చాలామంది సహకారం కావలసివస్తుంది.
- ఆ రోజుల్లో విమానాలు లేవు ,రైళ్లు మాత్రమే ఆ రోజుల్లో విమానాయనాలు అంత తరచుగా ఉండేవో నాకు తెలియదు.వాళ్ళు చెన్నై వచ్చి అక్కడినుంచి తిరువణ్ణామలై వచ్చారు.వారు రైలులో వచ్చారని నాకు చెప్పారు.
- మూలికలు ఏరుకుని తీసుకువచ్చారు.యోగానందపురి తన రక్తం ఇచ్చారు.మూలికలు అన్నీ అందులో నానపెట్టారు.ఆయనకు ఫస్ట్ ఎయిడ్ చేసారు .బ్యాండ్ ఎయిడ్. అది నయం అయిపోయింది.ఆయనకు హీలింగ్ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది.అయన చాలా సులువుగా నయం చేసుకుంటారు.
- వాళ్ళు ఆ మూలికలను నా శరీరానికి కట్టారు,మరియు ORI తొమ్మిది లోహాల గొలుసుతో కట్టి ఆలా మూడు రోజులు ఉంచారు.
- మరియు ఇతర శిక్షణలు అన్నీ - అది చాలా శక్తివంతమైనది,పవిత్రమైనది... ఆ మొత్తం శిక్షణ గురించి వివరాలు నేను చెప్పదలచుకోలేదు.కానీ ఎవరైనా ఇలాంటి శిక్షణ తీసుకుని,వారి శరీరం ఎలా అవుతుందో నేను ఒక వీడియో ద్వారా చూపించగలను.ఒక సాధువు ఇలాంటి శిక్షణని తీసుకున్నారు.
- ఎప్పుడైనా ఒక గురువు అత్యుత్తమ చేతనస్థితి పరివర్తన ప్రక్రియను వారి శిష్యులమీద విజయవంతంగా మానిఫెస్ట్ చేస్తారో ,ఆ శిష్యుడు పుణ్యవంతుడు,మరియు వెళ్లి శక్తులను మానిఫెస్ట్ చేయమంటారు.ఇలాంటి ఒక సాధువు ఈ శాస్త్రాన్ని విజయవంతంగా మానిఫెస్ట్ చేసారు.ఆయనకు అత్యుత్తమ చేతనస్థితి పరివర్తన ప్రక్రియ భౌతికంగా జరిగింది.కుంభమేళా లో నా రధం ని లాగడానికి ఆయనను అయన గురువు పంపించారు.
కుంభమేళా లో నా రధం లాగిన ఇద్దరు సాధువుల గురువు వారికీ శిక్షణ ఇచ్చారు,ఇద్దరు సాధువులు ఈ శాస్త్రాన్ని స్వాలంబనం చేసుకున్నారు.( MASTERED ). వారి గురువు వారితో చెప్పారట,వెళ్లి స్వామిజి రధం లాగమని,ఎందుకంటె అయన శరీరం మీద ప్రత్యక్షంగా పనిచేసారు,అయన ఈ శాస్త్రాన్ని స్వాలంబనం చేసుకున్నారని.
- రెండు వీడియో లు నేను మీకు చూపించాల్సిన అవసరం వుంది.ఆకాశ గరుడ మూలిక ,అది లావుపాటి ఇనుప రాడ్ ను తెంపుతుంది.ఇంకొక వీడియో నాగ సాధు,ఈ ఆల్కెమీ శాస్త్రాన్ని అయన స్వాలంబనం ( MASTERED )చేసుకున్నారు,ఆయనమీద అత్యుత్తమ చేతనస్థితి పరివర్తన ప్రక్రియ భౌతిక స్థాయిలో జరిగింది.
- తపస్సు అంటే నిర్బందకరమైన థాట్ కరెంటు ని,తర్కాన్ని బ్రేక్ చేయడం ఒక్కటే కాదు.నిర్బందకరమైన ( RESTRICTIVE ) చేతనస్థితి బ్రేక్ చేయడం.తపస్సు మిమ్మలను ఈశ్వరుణ్ణి చేస్తుంది.
- ఈ 36 తత్వాలలో ఈశ్వర తత్వ తపస్సు ద్వారా మీలో మానిఫెస్ట్ అవ్వడం మొదలుపెడుతుంది.ఈ సత్సంగ్ ని 2 -3 సార్లు చూడండి.నేను ఈశ్వర తత్వ గురించి వివరించాను,తపస్సు అంటే ఏమిటి,నా గురువులచే నా మీద చేయబడిన తపస్సు.
- తపస్సు మీలో ఈశ్వర తత్వాన్ని మానిఫెస్ట్ చేస్తుంది.
నా గురు పరంపర,మరియు వారు నాకు చేసినది ,వారిమీద వారు చేసుకున్నది అదే నాకున్న నిజమైన ఆస్థి,సంపద. మీ అందరిని దీవిస్తున్నాను. ఈ ప్రవచనం చూడాలంటే https://www.youtube.com/watch?v=z_Lv4TWsQ1E
ఛాయాచిత్రములు:
నిత్యానంద సత్సంగము యొక్క మణిరత్నములు
ఫేస్-బుక్ పేజీ లింకులు
https://www.facebook.com/ParamahamsaNithyananda/posts/4317793681641782
https://www.facebook.com/srinithyananda.swami/posts/1746064915548500