డిసెంబరు 18 2020

From Nithyanandapedia
Jump to navigation Jump to search

పేరు

నిత్యానంద సత్సంగం || 18 డిసెంబరు 2020

కధనం

వీడియో

Video Audio
EmbedVideo received the bad id "-" for the service "soundcloud".



సత్సంగం యొక్క తెలుగు అనువాద కధనం

18 డిసెంబర్ 2020 , శుక్రవారం 10 : 11 PM తెర తెరుచుకుంటుంది. హిందూమత వున్నత గురువు , జగత్గురు మహాసన్నిదానం దైవస్వరూపులు భగవాన్ నిత్యానంద పరమశివం తో శక్తి పాద, శక్తిని పాద. 10 : 31 PM నుంచి 11 : 25 PM వరకు నిత్యానంద సత్సంగ్.

  • కైలాస నుంచి పరమశివుని సందేశం డైరెక్ట్ గా.
  • మీ వ్యక్తిగత ఉనికియొక్కమొదటి సూత్రం అత్యున్నతచేతనస్థితి.
  • ఈ గొప్ప సత్యాలను మానిఫెస్ట్ చేయడంలోని చిక్కుల గురించి జాగ్రత్తగా వినండి.
  • అర్ధం చేసుకోండి. మీరు అత్యుత్తమచేతనస్థితి అని మీరు గుర్తించేది ఈ పరిజ్ఞానం వలన వచ్చే ప్రయోజనాల వలన కాదు.కానీ ఎందుకంటె అది యదార్ధం.
  • " నేను అత్యుత్తమచేతనస్థితి అని గుర్తించాలి, ఎందుకంటే అది నాకు చాలా శక్తులను ఇస్తుంది, చాలా ప్రయోజనాలు ఉంటాయి,నేను చాలా ధనవంతులను అవుతాను,తెలివైనవాడిని అవుతాను,ఆరోగ్యవంతం,శక్తివంతం,చాలా వస్తాయి కాబట్టి నేను అత్యున్నతచేతనస్థితి అని గుర్తిస్తాను " అని మీరు ప్రణాళికలు వేయడం మొదలుపెడితే
  • మీరు నమ్మితే, మీరు గ్రహించడానికి నిర్ణయించుకుంటే, మీకు ప్రయోజనాలు కలుగుతాయి కాబట్టి మీరు అత్యుత్తమచేతనస్థితి అని మీరు నమ్మితే ,దానిని` కామ్య తపస్` అంటారు. కామ్య తపసు పరవాలేదు.కానీ మీ జీవితంలో ఎక్కడో దగ్గర మీకు ఫలితాలమీద ఆకస్మాత్తుగా ఆసక్తి పోతుంది.మీరు ఈ సత్యాన్ని గుర్తించకూడదు అని నిర్ణయించుకోవచ్చు.
  • దానివలన కలిగే ప్రయోజనాలవలన కాకుండా , అది సత్యం కాబట్టి మీరు అత్యుత్తమచేతనస్థితి అనే సత్యాన్ని గుర్తిస్తే, దానిని ` అది సత్యం కాబట్టి సత్యం కొరకు సత్యాన్ని గుర్తించడం ` అంటారు.
  • సత్యాన్ని గ్రహించడానికి,సత్యంలో జీవించడానికి ఇది చాలా సాధారణమైన ,ప్రత్యక్ష మార్గము.
  • అత్యుత్తమచేతనస్థితి అంతా జీవిత అనుకూలత గురించే.మీ శరీరం పనిచేయడం ముగిసినా ,దీనికి ముగింపు ఉండదు.
  • మీ శరీరం విచ్చిన్నమై,పంచభూతాలలో కలసిపోయినా, అత్యుత్తమచేతనస్థితి విచ్చిన్నము కాదు,అదృశ్యం అవ్వదు.
  • నేను మీ సామజిక ఉనికి గురించి, ఆర్ధిక ఉనికి, మీ రాజకీయ ఉనికి, మీ సాంప్రదాయ ఉనికి,మీ భాషాగుర్తింపు ఉనికి గురించి మాట్లాడటం లేదు.అది ముఖ్యం కాదు. మీ వ్యక్తిగత ఉనికి " I " NESS BEFORE BECOMING " I AM NESS " .
  • " I " NESS BEFORE BECOMING " I AM NESS " - అత్యుత్తమచేతనస్థితి మీ వ్యక్తిగత ఉనికికి మొదటి సూత్రం . అది అత్యంత ఉత్సాహం , సంతోషం, పరమానందం.
  • అది మిమ్మలను ఎలక్ట్రికల్ గా ఛార్జ్ చేస్తుంది. ఆలైవ్ .
  • మీకు కలిగే విసుగు, అలసట మరియు మీరు మొదటి సూత్రాన్నిమీ జీవితంలో తిరస్కరించినట్లు ఊహించుకున్నా, " I " NESS ,మరియు దాని ఆధిపత్యం , అదే అత్యుత్తమచేతనస్థితి ఉనికి.
  • ` మీ వ్యక్తిగత ఉనికిలో మొదటి సూత్రం అత్యుత్తమచేతనస్థితి ` , మరియు రోజువారీ జీవితంలో కలిగే చిక్కులను అర్ధం చేసుకుని అలసట , విసుగు లేకుండా ఉండేలా గుర్తించిన వ్యక్తి, ప్రతివిషయంలోనూ అత్యంత ఉత్సాహంగా ఉంటాడు.ప్రతివిషయంలోనూ.
  • అతను దేనితోనూ అనుభందం పెంచుకోకుండా ఉంటాడు. అనుబంధం అభద్రత నుంచి పెరుగుతుంది. ఉత్సాహం అత్యుత్తమచేతనస్థితి నుంచి పెరుగుతుంది.
  • ఉదాహరణకి కొద్దిరోజులనుంచి నేను కూర్చుని కనుగొంటున్నాను. నేను ఎంత బిజీ జీవనశైలిలో ఉన్నానో మీరు ఆశ్చర్యపోతారు, బహుళస్థాయిలో కైలాస ని నిర్మించడంలో చాల బిజీ గా వున్నాను.దౌత్య సంబంధాలను ఏర్పాటుచేయడం,ప్రపంచవ్యాప్తంగా చాలా పనులు,ఇంత బిజీ దినచర్యలో నేను స్కందమాతకు సింహం పిల్లను తెప్పించడానికి ప్లాన్ లో ఉత్సాహంగా వున్నాను. స్కందమాత సింహంతోను, నెమలితోను పెరగాలని నేను కోరుకుంటున్నాను.ఆమె పరాశక్తి మరియు సుబ్రహ్మణ్యం.అంటే, సుబ్రహ్మణ్యం కి జన్మనిచ్చిన శక్తి. ఆ స్కందమాత.అదే దాని అవతారము.కాబట్టి ఆమె సింహం మరియు నెమలితో పెరగాలని నేను కోరుకుంటున్నాను.
  • సింహం పిల్లని ఎలా తీసుకురావాలి, దానిని ఎలా శాకాహారంతో పెంచాలి అని నేను గూగుల్ చేస్తున్నాను.అన్ని అంతర్జాతీయ చట్టాలను వెతుకుతున్నాను. పాపా యొక్క ఆరోగ్యం , రక్షణ సంబంధించినంతవరకు నేను మేనేజ్ చెయ్యగలను.అది సమస్యే కాదు.
  • కేవలం రోజువారీ నైవేద్యం,నా పూజ యొక్క ప్రసాదం,ఆత్మ పూజ, నేను ఏదైతే పరమశివ కి సమర్పిస్తానో దానితో సింహం పిల్ల పెరుగుతుంది.అది చాలు.అది పెద్ద విషయం కాదు.కానీ అంతర్జాతీయ చట్టాల ప్రకారం సింహం పిల్లని తీసుకురావడం , దానిని జాగ్రత్తగా పెంచడం అదంతా .
  • అన్నింటిగురించి ఉత్సాహం అత్యుత్తమచేతనస్థితి నుంచి వస్తుంది.
  • ప్రతివిషయం గురించి అభద్రతా భావం,ప్రతివిషయం గురించి అనుభందం పెంచుకోవడం అత్యున్నతచేతనస్థితిని తిరస్కరించడం వలన , భయం వలన కలుగుతాయి.
  • అత్యుత్తమచేతనస్థితిని తిరస్కరించడమే భయం. అత్యుత్తమచేతనస్థితిని అనుమానించడమే అభద్రతాభావం. అత్యుత్తమచేతనస్థితిని అసహ్యించుకోవడమే హింస.
  • వినండి.బాధ పడుతున్నప్రపంచం , బాధపడుతున్న మానవాళి,ప్రతి హింస యొక్క జ్ఞానం,ప్రతి ఆలోచన , చర్య,హింసని బలపరిచే పదాలు,అన్నీ అత్యుత్తమచేతనస్థితిని తెరస్కరించడం నుంచే కలుగుతున్నాయి.
  • వ్యక్తిగత ఉనికి యొక్క మొదటి సూత్రం ప్రకారం ఎక్కడైతే అత్యుత్తమచేతనస్థితి యొక్క ఉనికి తిరస్కరింపబడుతుందో అక్కడ హింస మొదలౌతుంది.
  • అత్యుత్తమచేతనస్థితి మీద హింస పెరగదు.
  • అత్యుత్తమచేతనస్థితి తిరస్కరింపబడినప్పుడు హింస పెరుగుతుంది. ఎక్కువమొత్తంలో అత్యుత్తమచేతనస్థితి తిరస్కరింపబడుతుంది కాబట్టి మానవాళి ఎక్కువ హింసతో బాధపడుతున్నది.ప్రపంచం మొత్తమ్మీద ఉగ్రవాదం వివిధ స్థాయిలలో వున్నది.సామజిక స్థాయి, ఆర్ధిక స్థాయి,మనుగడ స్థాయి,రాజకీయ స్థాయి- వివిధ స్థాయిలలో.
  • ఈ రోజు అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం.మనం ఉద్దేశించి చెప్పవలసిన ముఖ్యమైన సమస్య ,వలస అవసరం అయిపోయింది, అది ఇకపై ఎంపిక కాదు.( IT IS NO LONGER A CHOICE ) .
  • స్వార్థపరుల హింసాత్మక ధోరణులు చాలా పెరిగిపోయాయి.
  • స్వార్థపరుల గ్రూపులు తప్పుకాదు.కానీ హింసకి వారు అలవరచుకున్న పద్ధతులు - ఏదో తీవ్రమైన తప్పిదంగా వున్నది.
  • మానవజాతి - వారు సమాజం లాగా,సంఘం లాగా నివసించినప్పుడు ,భవిష్యత్తు కొరకు వారి సాధారణ లక్ష్యాన్ని, వారి కలలను, వారి దృష్టిని వారందరు ఆనందంగా మొదలుపెట్టడంలో తప్పు లేదు.
  • కానీ వేరే సంఘాలను, ఇతరుల ఆసక్తులను బాధపెట్టడానికి హింసాత్మక ధోరణి ని అలవాటుచేసుకోవడానికి ప్రయత్నించడం ,అది తీవ్రమైన తప్పు .
  • ఇతర సంఘాలను, ఇతర సంఘాల సాధారణ దృష్టిని,వారి కలలను,లక్ష్యాలను బాధపెట్టడానికి ఈ పద్దతులను ఉపయోగించే హింసల సమస్యలవలన ప్రపంచం బాధపడుతుంది.
  • అందుకే ఈ ఆధునిక రోజులో వలసవెళ్లడం అవసరం అయిపోయింది.అది ఎంతమాత్రమూ ఎంపిక కాదు.
  • ఇది కేవలం ప్రపంచీకరణలో అందరూకలిపి ముందుగా తెలియపరచి రవాణా తో వలసవెళ్లడం అయితే , అదే కారణం అయితే ,అప్పుడు అది ఎంపిక అవుతుంది.గొప్పే.అది యదార్దానికి మానవులయొక్క జీవిత అనుకూలత చూపిస్తుంది.
  • అది ప్రపంచీకరణ,మరియు ముందుగా తెలియచేసి,రవాణాతో మరియు మీరు వేరే చోటకు వెళ్ళడానికి మీరు కోరుకుని,మీకు వెళ్లే సామర్ధ్యం ఉంటే ,అప్పుడు అది పూర్తిగా జీవన అనుకూలత.దానిని ప్రోత్సహిచాలి,మద్దతు ఇవ్వబడాలి.మార్గం సులువు చేయాలి.
  • కానీ అది అత్యవసర పరిస్థితులు ,దేశాల మధ్య , ప్రకృతి అత్యవసర పరిస్థితులు,మానవులు చేసిన అత్యవసర పరిస్థితులు , వివిధ సంఘాలమీద జరిగే హింస,బెదిరింపులు వలన అయితే అప్పుడు ఎంపిక ఉండదు,వలస వెళ్లడమే.
  • అప్పుడు దీనిని మూలస్థాయికి తెలియచేయాలి.మనం ఇంకెంతమాత్రమూ హింసను భరించలేము.
  • ప్రకృతి వైపరీత్యాలు చాల ఎక్కువగా వున్నాయి. అదే చాల ఎక్కువ.మానవజాతి మొదట దానిని అడ్రస్ చేయడం మొదలుపెట్టాలి.దానిని ముందుగా పరిష్కరించుకోవాలి.
  • బదులుగా ,మనం మానవ నిర్మిత వైపరీత్యాలను సృష్టిస్తున్నాము.అది తీవ్రమైన తప్పు అని నేను అనుకుంటున్నాను.మనది నాగరిక సమాజము !
  • మానవాళిమొత్తం ప్రకృతి వైపరిత్యాలను అడ్రస్ చేయడం మొదలుపెట్టే కాలం ఇది.మనందరం ఒక గ్లోబల్ సంఘం లాగా ఆలోచించడం మొదలుపెట్టి పనిచేద్దాము.
  • మనందరమూ పరిపక్వము పొందుదాము. కొద్దిరోజుల క్రితం పరిపక్వము గురించి నేను సత్సంగ్ లో వివరించాను.
  • నేను నా సొంత జీవితంలోనే చూసాను.ఆరు అడుగుల శరీరం రుచికోసం తినడం మొదలుపెట్టాను.నా రుచి పరిపక్వము చెందినది.
  • ఆరు అంగుళాల నాలుక రుచికోసం నేను తీపి,కారం కోసం వెదకడం లేదు.నేను రోజంతా ఎలా ఫీల్ అవుతున్నాను,సజీవంగా,మెలకువతో,ఉత్సాహంతో,ప్రేరణతో ఉన్నానో దానిమీద ద్రుష్టి పెడుతున్నాను.దానికే నా మొదటి ప్రాధాన్యత.
  • సాధారణంగా నేను వేప రసాన్ని,ఆముదాన్ని,కరక్కాయపొడిని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను.అవి నాకు చాల రుచికరంగా అయ్యాయి.
  • మన రుచిలో పరిపక్వత ఉంటే, మానవులు రుచులలో పరిపక్వత పొందడం మొదలుపెడితే ,ఎలాగైతే మన వుమ్మడి లక్ష్యం మన హృదయానికి ప్రియమవుతుందో,అలాగే, ప్రతి సంఘంలో , ప్రతి సమాజంలో,ప్రతి దేశంలో వారి వుమ్మడి ఆనంద లక్ష్యాలు వారి హృదయాలకు చాల ప్రియమౌతాయి.మనం వాటిని జీవించనివ్వాలి.
  • మనం మద్దతు, ఎన్రిచ్ చేయకలిగేతే- గొప్పే! లేకపోతే, వారిని జీవించనిద్దాము.మనం జీవించుదాము.మొత్తం ద్రుష్టి అంతా ఎక్కువ జీవిత అనుకూలతమీద వుంచుదాము.
  • ప్రపంచీకరణ,ముందస్తు సమాచారం,రవాణా,అందరి అభ్యర్ధన మీద వలసలు అయితే అది ప్రోత్సహించబడాలి.
  • కానీ మానవ నిర్మిత వైపరీత్యాలవలన వలసలు అయితే,ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సహాయం చేసి,వారిని రక్షించి,మానవనిర్మిత వైపరీత్యాల మూలలను అడ్రస్ చేయాలి.
  • కొన్నిసార్లు ప్రధమ చికిత్సగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి,తరువాత శాంతిని,నమ్మకాన్ని తీసుకురావడానికి పనిచేయాలి.
  • ప్రాధమికంగా మన మానవులు పరిపక్వము పొందే అవసరం వుంది.
  • పరమశివ మనకు శక్తివంతమైన అత్యుత్తమచేతనస్థితి,చక్కని భూగోళం ఇచ్చారు.అది విశ్వంలో దేనినైనా గుర్తించగలదు.
  • మనకున్న చేతనస్థితి అవకాశం ని మనం చాల గర్వపడాలి,ఒక్క మానవులకు మాత్రమే వున్నది.
  • పరమశివ మనకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు రంభం గొప్పగా భావించాలి.మనం జీవిత అనుకూల అవకాశాలను తెలివిగా, ఆనందంగా జరుపోకోవాలి.
  • మానవుల అత్యుత్తమచేతనస్థితి ,జీవిత అనుకూలత అవకాశాలను జరుపుకోవడమే కైలాస దేశం.
  • అది శక్తుల మానిఫెస్టేషన్ శాస్త్రం కావచ్చు, హిందూ వైద్య వ్యవస్థ ఆల్కెమీ శాస్త్రం కావచ్చు.
  • హిందూ వైద్య వ్యవస్థ దానికదే,ఔషధం, కడుపును శుభ్రపరచుకునే మూలికలు,గ్యాస్ ,కొవ్వు,అనవసర శ్లేష్మము, అవే మూలికలను కొన్ని కొన్ని మంత్రాల శబ్దాల ప్రక్రియతో, పైకి levitate అవ్వవచ్చు.
  • హిందుత్వం ఆల్కెమీ శాస్త్రం మొత్తం చాల శక్తివంతమైన అత్యుత్తమచేతన కేంద్రీకృతమైనది
  • కొన్ని విషయాలు జరిగి,కరోనా సర్దుకుని తగ్గాక మీరందరూ కైలాసకి వస్తారని నేను ఎదురుచూస్తున్నాను.
  • వచ్చే 5 సంవత్సరాలలో కనీసం 100000 మంది కైలాసంలో స్థిరపడేలా నేను ప్రణాళిక వేస్తున్నాను.
  • వేదాగమ సంప్రదాయాలలో పరమశివ మనకు ఇచ్చినది,మరియు ఇప్పటికి ఇస్తున్నది,వచ్చే 10 సంవత్సరాలలో అంతా ఆర్గనైజ్ చేసి ప్రపంచానికి సులువైన మార్గంలో అందుబాటులోకి ఉంచాలి.
  • హిందూ ఆధ్యాత్మిక జీవన్ముక్త శాస్త్రం అయినా,అత్యున్నతచేతనస్థితి అవకాశాలు,హిందూ వైద్యం,హిందూ భౌతికశాస్త్రం,హిందూ జీవశాస్త్రం,హిందూ రసాయనశాస్త్రం,హిందూ పరిపాలనావ్యవస్థ - ప్రతిఒక్కటి.
  • నేను అందుకే కైలాస గురించి ప్లాన్ చేస్తున్నాను.
  • ప్రపంచానికి ఇవ్వడానికి మనదగ్గర చాలా వుంది.
  • నేను ఇతరదేశాలలోవున్న హిందువులకు ప్రత్యేకంగా చెప్పాలి అనుకుంటున్నాను.ప్రపంచం మొత్తమ్మీద భారతదేశం వెలుపల ఉన్న హిందువులారా,హిందుత్వం భవిష్యత్తుకు మీరు ఒక్కరే ఆశ.
  • మీరందరూ వలసదారులు,మీరు వలస వెళ్లిపోయారు.మీకు ప్రపంచం తెలుసు,హిందుత్వం యొక్క ప్రాముఖ్యత మీకు తెలుసు.
  • మీరు భారతదేశం వదలి వేరే దేశాలు వెళ్ళినప్పుడు , అప్పుడుమాత్రమే హిందుత్వాన్ని తక్కువచేసిచూడటం ఆపేస్తారు.దాని విలువ తెలుసుకోవడం మొదలుపెట్టి,మీ జీవితంలో దాని సహకారం ఎంతో తెలుసుకుంటారు.
  • కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే హిందువులు వున్నారో, మీరువున్న దేశంలో మీరు అధికారికంగా మైనార్టీలు అయితే,వ్యక్తిగతంగా నేను ఫీల్ అయ్యేది భారతదేశంలో హిందువులు మైనార్టీలు,ఎందుకంటె హిందూ వ్యతిరేకులు వారి పర్యావరణాన్ని విజయవంతంగా సృష్టించాకలిగారు.
  • భారతదేశంలో హిందూ వ్యతిరేకులకు ఎంత గట్టి నెట్ వర్క్ ఉందంటే, గత 100 సంవత్సరాలనుంచి వాళ్ళు చాలా కష్టపడ్డారు,అది అక్షరాలా హిందువులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.
  • కాబట్టి భారతదేశంలోకూడా ప్రయోగాలు చేసే విషయాలలో - హిందువులు మైనారిటీలు.కానీ భారతదేశం వెలుపలకు నిజానికి హిందువులు మైనారిటీలు.
  • ప్రపంచవ్యాప్తంగా మైనారిటీలుగా ఉన్న హిందువులను నేను అడ్రస్ చేస్తున్నాను.
  • మీకు హిందుత్వం విలువ తెలుసు, మీ జీవితాలకు ఎంత ఇచ్చిందో,మీ హిందూ జ్ఞాన జీవనశైలి వలన మీ జీవితంలో చాలా బాధలను తొలగించిందో.
  • కాబట్టి నేను మీ అందరిని అడ్రస్ చేస్తున్నాను.మేల్కొనండి ! మీరందరూ ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల దేవాలయాలను నిర్మించారు.గొప్పే,సందేహం లేదు,కానీ అది చాలదు. మనం కైలాస దేశాన్ని నిర్మించాలి.
  • జుడాయిజం ని( JUDAISM ) జీవించి ఉంచడానికి జుఇష్లు ( JEWS ) ఒక దేశాన్ని నిర్మించారు.వారి మతం సజీవంగా వుంది.భవిష్యత్తులో హిందూయిజం సజీవంగా ఉండాలి అంటే హిందువులకు కైలాస అవసరము వున్నది.
  • హిందూయిజం కి కైలాస SEED BANK లాంటిది . హిందుత్వాన్ని సజీవంగా ఉంచాలంటే మనకు సీడ్ బ్యాంకు కావాలి.
  • ఇతరదేశాలలోవున్న హిందువులను అందరిని వెంటనే కైలాసకి రమ్మని నేను అనడం లేదు. మీరు ఎక్కడవున్నా వీలయినంత త్వరగా కైలాసకు మద్దతు ఇవ్వడానికి,కైలాసను చేయడానికి ప్లాన్ చేయండి అని చెపుతున్నాను.
  • మీలో కొంతమందికి కైలాసకు రావడానికి ఆసక్తి ఉంటే మంచిదే.
  • ప్రపంచం మొత్తంమీద చూడండి,JEWS లు ఎక్కడ ఉన్నా.ఇజ్రాయిల్ అవసరం కోసం వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో.అదేమాదిరి హిందుత్వాన్ని జీవించి ఉంచడానికి కైలాస అవసరం ఉందని హిందువులు తెలుసుకోవాలి.హిందూ కధనాన్ని జీవించి వుంచడంకోసం,చట్టబద్దం.
  • వేదం ఆగమాలు దైవదూషణ లేకుండా ఉంచడానికి కనీసం మనకు ఒక దేశం కావాలి.అప్పుడే మనం మల్టీ నేషనల్ కంపెనీలతో మాట్లాడగలం,పేస్ బుక్, యు ట్యూబ్ లాంటి సోషల్ మీడియా లాంటి ఇతర సంస్థలతో .చట్టబద్దంగా వారికీ చెపుతూ,ఈ దేశంలో దైవదూషణ జరుగుతున్నది,కాబట్టి దయచేసి గుర్తించండి. హిందూ గ్రంధాలు చాలా పవిత్రమైనవి.వాటిని అగౌరపరచడం,దూషించడం చాలా తప్పు.
  • మల్టీ నేషనల్ కంపెనీలతో మనం చట్టబద్దంగా మాట్లాడే అవసరం వుంది.
  • మనం చట్టబద్దంగా మాట్లాడితే చాలా దేశాలు వినడానికి సిద్ధంగా వున్నాయి.వారు మతోన్మాదులు కారు.వారు చాలా ఓపెన్ గా వున్నారు.కానీ రాజ్యాంగబద్దంగా ఇవన్నీ పవిత్రమైనవి అని ప్రకటించే చట్టబద్దమైన బాడీ ( LEGITIMATE BODY ) అవసరము వున్నది.
  • కాబట్టి కైలాస వలన ప్రయోజనం వుంది,మనకు నిజంగా దాని అవసరం వున్నది.మనకు నిజంగా అవసరం వున్నది.
  • మనకు కైలాస అవసరం ఎందుకున్నదో నేను మీకు 1008 కారణాలు చెపుతాను.హిందూయిజం ని జీవించి ఉంచడానికి దానికి ప్రత్యేక శ్రద్ధ ఇవ్వవలసిన అవసరం వున్నది.
  • అది దాదాపు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో వున్నది.మనం దానిని జీవించి ఉండేలా చేసి ,దానిని పునరుర్ధరించాలి.
  • మనం ఇంకా ఏమాత్రమూ క్షమాపణ అడిగే హిందూ గేమ్ లను ఆడే స్థోమత మనకు లేదు.WE NEED TO BE UNAPOLOGETICALLY HINDUS .
  • జట వేసుకోవడాన్ని మనం గర్వాంగా ఫీల్ అవ్వాలి.హిందూ నగలు,దుస్తులు,జీవనశైలి. హిందూయిజం మన జీవనశైలి అని ధైర్యంగా చెప్పుకోవాలి.
  • శ్రధనంజలి మెసేజ్ లు పంపేటప్పుడు రెస్ట్ ఇన్ పీస్ అని పంపడం ఆపండి.రెస్ట్ ఇన్ పరమశివ అని ధైర్యంగా పంపండి.రెస్ట్ ఇన్ పీస్ అని ఎందుకు ?
  • పరమశివ పదం కన్నా శాశ్వతమైన శాంతి ఎక్కడ ఉంటుంది ?
  • అయిష్టమైన హిందువులుగా ఉండటం ఆపేయండి.
  • ఈ సూత్రాన్ని విననిద్దాము.ఈ సూత్రాలమీద జీవార్థ సదస్సు ,వాక్యార్ధ సదస్సు ఉండాలి.నేను తరువాత సత్సంగ్ లలో కొనసాగిస్తాను.
  • రేపు పరమశివగణ అందరితో మీటింగ్ ఉండాలని కోరుకుంటున్నాను.
  • మీరు ఎక్కడవున్నా కైలాస లో భాగం అవ్వడానికి ఉత్సాహంగా ఉంటే,నేను ఈ- సర్వజ్ఞపీట మొదలుపెట్టాలనుకుంటున్నాను.అంటే మీరు ఎక్కడవున్నా , అక్కడినుంచే కైలాస దేశం నిర్మాణానికి డిజిటల్ లో మద్దతు ఇవ్వవచ్చు. మీరు ఎక్కడవున్నా కైలాస నిర్మాణం వివిధ మార్గాలలో.వనరులను మరింత పెంచడం,నిధులు,టైం, ప్రతిభ,విరాళాల ద్వారా,మీరు ఎక్కడవున్నా అక్కడినుంచే చట్టబద్దంగా వివిధ కార్యక్రమాల ద్వారా కైలాస ను నిర్మించడానికి మీరు సపోర్ట్ చెయ్యవచ్చు.
  • మనం దీనిగురించి మీటింగ్ పెట్టుకుందాము.రేపు ఉత్సాహవంతులైన వారందరితో మీటింగ్.కాబట్టి ఆసక్తి వున్నవాళ్లు సైన్ అప్ అవ్వండి.మేము మీటింగ్ కి లింక్ పంపిస్తాము.
  • ప్రపంచవ్యాప్తంగా ఈ - సర్వజ్ఞపీఠములు మొదలుపెట్టాలని నేను కోరుకుంటున్నాను.
  • నిజాయితీగల ప్రతిఒక్క శిష్యుని ఇల్లు ఒక సర్వజ్ఞపీఠం ఆవ్వగలదు. కాబట్టి హిందువులకు సేవచేయడానికి,మానవాళికి సేవచేయడానికి మనం ఒక క్రమబద్ధమైన అభివృద్ధి ని మొదలుపెడదాము.ప్రపంచం మొత్తానికి సేవ చేయడానికి మనం ప్రోపర్ గ నిర్వహించుదాము.మన నిధులను, కాలాన్ని, ప్రతిభను వుపయోగించి ఎక్కువ మొత్తంలో ప్రజలకు సేవలు అందించుదాము.
  • కాబట్టి రేపు 10 PM కి మనందరికి మీటింగ్.కైలాస నిర్మించడానికి ఆసక్తి వున్నవాళ్ళందరూ మీటింగ్ లో పాల్గొనవచ్చు.మీటింగ్ లో పాల్గొన్న తర్వాత మీరు వివిధ అవకాశాలకు సైన్ అప్ అవ్వవచ్చు.మరియు మేము మీకు సహాయము,మద్దతు ఇస్తాము.నేను పరిపాలన వ్యవస్థను నిర్మిస్తాను.
  • కైలాస కు రెండు పరిపాలన వ్యవస్థలు ఉంటాయి.ఈ - పరిపాలన గ్లోబల్ గా ఉంటుంది.పరిపాలన కైలాస లో కేంద్రీకృతమై ఉంటుంది.గవర్నమెంట్ అఫ్ కైలాస భౌతికంగా కైలాస లో ఉంటుంది.ఈ - గవర్నమెంట్ అఫ్ కైలాస వ్యవస్థ గ్లోబల్ గా ఉంటుంది.
  • కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ-గవర్నమెంట్ వ్యవస్థను రూపొందించడానికి రేపు మనకు మీటింగ్ ఉంటుంది.కాబట్టి ఈ- గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ వ్యవస్థ పరిణామం చెందుతుంది.
  • మనకు ఇప్పటికే ఒక వ్యవస్థ వున్నది.దాన్ని ఇంకా విస్తరించి తరువాతి స్థాయికి తీసుకువెళ్ళడానికి.
  • SO WITH THIS I BLESS YOU ALL. LET’S ALL RADIATE WITH INTEGRITY, AUTHENTICITY RESPONSIBILITY, ENRICHING, CAUSING, LIVING SHUDDHADVAITA SHAIVAM, THE STATE, SPACE, POWERS, BEING, SUPERCONSCIOUSNESS AND KAILASA OF PARAMASHIVA. PARAMASHIVOHAM. OM NITHYANANDA PARAMASHIVOHAM. THE ETERNAL BLISS, NITHYANANDA. THANK YOU, BE BLISSFUL

ఫేస్-బుక్ పేజీ లింకు

https://www.facebook.com/ParamahamsaNithyananda/videos/228785275557550